Ukraine President : ఓ వైపు బలమైన రష్యా తనను టార్గెట్ చేసింది. ముందస్తు హెచ్చరికలు లేకుండానే యుద్దానికి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో దళాలు విరుచుకు పడుతున్నాయి. బాంబుల మోత మోగుతోంది.
మిస్సైళ్లు కళ్ల ముందు వాలి పోతున్నాయి. భవనాలు ధ్వంసం అవుతున్నాయి. కానీ ఒక్కడు మాత్రం ఏ మాత్రం బెదరడం లేదు. దేశం కోసం చావుకు సైతం సిద్దమని ప్రకటించాడు.
అతడు ఎవరో కాదు యావత్ ప్రపంచం మొత్తం తన వైపు ఉన్నప్పటికీ కోలుకోలేని రీతిలో ప్రత్యర్థి రష్యా విరుచుకు పడినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ద పడిన నాయకుడు ఉక్రెయిన్ (Ukraine President )దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ.
తాను సైతం రంగంలోకి దిగాడు. తాము శాంతిని మాత్రమే కోరుకుంటామని, ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని ఇప్పటికే స్పష్టం చేశాడు. జాతి యావత్తు కదనరంగంలోకి దూకాలని పిలుపునిచ్చాడు.
ఓ వైపు పిట్టల్లా రాలుతున్నా తాను మాత్రం ముందుకే కదులుతున్నాడు. ఇలాంటి వాళ్లే దేశానికి కావాలి.
నాయకులు ఎక్కడో ఉండరు. మనలోంచి పుడతారు.
అవసరమైన సమయంలో ముందుకు వస్తారు. తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు.
అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో తాను పారి పోయేందుకు వీలున్నా కానీ దేశం కోసం యుద్ద రంగంలోకి దిగాడు.
సైనికులకు దిశా నిర్దేశం చేస్తూ కదులుతున్నాడు. యావత్ లోకమంతా అతడిని చూసి, ఆ ధైర్యాన్ని, తెగువను చూసి విస్తు పోతోంది.
వీరుడంటే ఇలా ఉండాలి కదా. ఇతను కదా నాయకుడంటూ కితాబు ఇస్తున్నారు.
ఓ వైపు అంగ, అర్ధ, ఆయుధ బలం కలిగిన మదమెక్కిన రష్యా విర్రవీగుతుంటే చిన్న దేశమైన ఉక్రెయిన్ తల వంచేందుకు ససేమిరా అంటోంది.
రాజకీయాల్లో వెన్ను పోట్లు ఉంటాయేమో కానీ యుద్ద నీతిలో ఇవేవీ ఉండవు.
ఉంటే రష్యా ప్రెసిడెంట్ దాడికి పిలుపునిచ్చే వాడు కాదు. చివరి దాకా తనకు తోడుగా వస్తారని అనుకున్న నాటో చేతులెత్తేసింది.
కానీ ఉక్రెయిన్ చీఫ్ మాత్రం అధైర్యానికి లోను కాలేదు.
నాకు ప్రాణం కంటే దేశ పదవి కంటే దేశమని..దానితో మమేకమైన ప్రజలను కాపాడు కోవడమని ప్రకటించాడు జెలెన్ స్కీ(Ukraine President ).
సరిహద్దు ఉద్రిక్తతల వద్ద సైనికులతో పాటే తాను కూడా పాల్గొన్నాడు.
అధ్యక్ష భవనంలో రాజ సౌధంలో కూర్చోకుండా జవాన్లతో కలిసి తుపాకీ చేత పట్టాడు. ఇప్పుడు అతడే హీరోనంటూ ప్రపంచం కితాబు ఇస్తోంది.
సైనికుల్లో మనో స్థైర్యాన్ని నింపుతున్న ఈ యోధుడు యుద్ద రంగంలో ఓడి పోవచ్చు . కానీ చరిత్ర ఉన్నంత కాలం బతికే ఉంటాడు. వీరుడా యోధుడా సలాం.
Also Read : అమెరికా వ్యవహారం ఉక్రెయిన్ ఆగ్రహం