IKEA CEO : ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన స్వీడిష్ ఫర్నీచర్ రిటైలర్ కంపెనీ ఐకియా భారత్ పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఐకియాకు మొట్ట మొదటిసారిగా మహిళను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది.
ఆమె ఇప్పటికే సదరు సంస్థలో వివిధ హోదాలలో పని చేశారు. సిఇఓతో పాటు చీఫ్ సస్టైనబుల్ ఆఫీసర్ గా కూడా కీలక బాధ్యతలు అప్పగించింది.
ఇక ఇప్పటి వరకు ఇండియా సిఇఓగా ఉన్న పీటర్ బెట్టెల్ నుంచి పుల్వెలర్ బాధ్యతలు స్వీకరించారు. ఐకియా ఇండియా టాప్ బాస్ గా పని చేయక ముందు సుసానే (IKEA CEO)పుల్వెరర్ ఇంగ్కా గ్రూప్ కంపెనీలో గ్రూప్ బిజినెస్ రిస్క్ , కంప్లైయెన్స్ మేనేజర్ గా పనిచేశారు.
ఆ తర్వాత 1997లో ఐకియాలో చేరారు. వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఇండియాలో ఆమెకు పని చేసిన అనుభవం ఉంది. ఇంగ్కా గ్రూప్ కు భారత దేశం ప్రాధాన్యత కలిగిన మార్కెట్ గా ఉంది.
దేశ వ్యాప్తంగా ఐకియాను పర్పస్ లీడ్ బ్రాండ్ గా పరిచయం చేయడం. నగరాల్లో ఓమ్ని చానెల్ ఉనికిని విస్తరించడం. స్థానిక వనరులు, రిటైల్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం పై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు.
ఐకియా తన దీర్ఘకాలిక విస్తరణలో భాగంగానే 2030 వరకు టాప్ బ్రాండ్ గా మారాలని చూస్తోంది. ఇక పుల్లెలర్ ఐకియా సంస్థలో కమ్యూనికేషన్స్ విభాగంలో ఐదు సంవత్సరాల పాటు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు..
Also Read : అంకురాలు..ఆవిష్కరణలకు ఊతం