Mithali Raj : భారత మహిళా జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాబోయే ప్రపంచ కప్ లో హర్మన్ ప్రీత్ కౌర్ టీమ్ వైస్ కెప్టెన్ గా ఉంటారు. ఈ విషయాన్ని ధ్రువీకరించింది హైదరాబాద్ స్టార్ ,
ప్రస్తుత జట్టు స్కిప్పర్ మిథాలీ రాజ్(Mithali Raj ). న్యూజిలాండ్ తో జరిగిన చివరి రెండు వన్డేల్లో దీప్తి శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవహరించింది. ఇదిలా ఉండగా నాల్గవ వన్డేలో ఆడలేదు హర్మన్ ప్రీత్ కౌర్.
దీప్తిని చివరి రెండు వన్డేలకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్ వ్యవహరించినా హర్మన్ ప్రీత్ ఆడనుంది. దీప్తిని ఇప్పటి దాకా కొనసాగించి వరల్డ్ కప్ లో మాత్రం హర్మన్ ప్రీత్ కౌర్ ఉప సారథ్యం వహిస్తుందని స్పష్టం చేసింది మిథాలీ రాజ్(Mithali Raj ).
మహిళల ప్రపంచ కప్ న్యూజిలాండ్ లో మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు తన మొదటి మ్యాచ్ ను మార్చి 6న పాకిస్తాన్ తో తలపడనుంది.
హైదరాబాద్ కు చెందిన స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ప్రపంచంలోనే టాప్ ప్లేయర్ గా వినుతికెక్కింది. అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్ లలో మిథాలీ రాజ్ టాప్ లో నిలిచారు.
ఇప్పటి దాకా టీమిండియాకు ఎనలేని విజయాలు సాధించిన నాయకురాలిగా పేరొందారు. ఇప్పటికే అరుదైన చరిత్రను సృష్టించింది మిథాలీ రాజ్.
అపారమైన అనుభవం కలిగిన కెప్టెన్ గా కొనసాగుతూ వస్తోంది. వరల్డ్ కప్ లో సత్తా చాటుతామని స్పష్టం చేసింది మిథాలీ రాజ్.
Also Read : కుటుంబం కోసం వార్నర్ భావోద్వేగం