Smriti Mandhana : భారత మహిళల క్రికెట్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే వరల్డ్ విమెన్స్ క్రికెట్ లో తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది స్మృతీ మంధాన.
ఒక్కసారి క్రీజులోకి వచ్చి కుదురుకుంటే చాలు దుమ్ము రేపే ఇన్నింగ్స్ ఆడడం ఆమె స్వంతం. ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాదీ స్టార్ ప్లేయర్, ప్రస్తుత మహిళా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మిథాలీ రాజ్ కు ఒక రకంగా కోలుకోలేని దెబ్బగా పరిగణించ వచ్చు.
ఎలాగైనా సరే తన సారథ్యంలో వరల్డ్ కప్ తీసుకు రావాలన్న లక్ష్యంతో ఆడుతోంది. న్యూజిలాండ్ వేదికగా విమెన్స్ వరల్డ్ కప్ సాగనుంది.
తాజాగా ఇందుకు సంబంధించి ఐసీసీ వరల్డ్ మహిళల ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహించారు. దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఆడింది.
ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్, సూపర్ బ్యాటర్ స్మృతీ మంధాన (Smriti Mandhana)తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ 2వ ఓవర్ లో ప్రత్యర్థి సౌతాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ బౌన్సర్ వేయడంతో ఉన్నట్టుండి హెల్మెట్ ను తీవ్రంగా తాకింది.
దీంతో స్మృతి మంథాన ఉన్నట్టుండి క్రీజులో అలాగే ఉండిపోయింది. ఆమె వేసిన బౌన్సర్ ను ఫుల్ షాట్ ఆడేందుకు యత్నించింది. అయితే బాల్ అందక పోవడంతో హెల్మెట్ ను తాకింది.
దీంతో తలకు బలమైన గాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదంటూ స్పష్టం చేసింది బీసీసీఐ. కాగా భారత జట్టు విజయాన్నినమోదు చేసింది.
Also Read : హర్మన్ ప్రీత్ కౌర్ కు మిథాలీ రాజ్ కితాబు