Suresh Raina : రైనాపై గుజ‌రాత్ టైటాన్స్ ఫోక‌స్

జేస‌న్ రాయ్ స్థానంలో ఛాన్స్

Suresh Raina  : ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ సురేష్ రైనాకు(Suresh Raina ). సీఎస్కేలో కీల‌క ఆట‌గాడిగా ఉంటూ వ‌చ్చాడు. ఎన్నో విజ‌యాల‌లో కీల‌క భూమిక పోషించాడు.

కానీ ధోనీతో పొస‌గ‌క ఈసారి వేలం పాట‌లో అత‌డిని ఏ ఫ్రాంచైజీ తీసుకునేందుకు ఇష్ట ప‌డ‌లేదు. దీంతో అమ్ముడు పోని ఆట‌గాళ్ల జాబ‌తాలోకి చేరి పోయాడు. కానీ అదృష్టం త‌లుపు త‌డితే ఎవ‌రూ ఏమీ చేయ‌క పోయినా త‌లుపు త‌ట్టే ఛాన్స్ ఉంది.

కాగా జేస‌న్ రాయ్ ని గుజ‌రాట్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ. 2 కోట్ల‌కు చేజిక్కించుకుంది. ఐపీఎల్ లో ఆడిన అనుభ‌వంతో పాటు ఒంటి చేత్తో సీఎస్కే కు విజ‌యాలు చేకూర్చి పెట్టిన ఘ‌న‌త సురేష్ రైనాదే(Suresh Raina ).

కానీ ఇటీవ‌ల అంతంత మాత్రంగానే ఆడుతూ ఉండ‌డంతో సీఎస్కే ప‌క్క‌న పెట్టింది. తాజా, మాజీ ఆట‌గాళ్లు సైతం సురేష్ రైనా ఎంపిక కాక పోవ‌డంతో విస్తు పోయారు. నెటిజ‌న్ల‌తో పాటు ఫ్యాన్స్ సైతం రైనాకు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇప్ప‌టికే 2016, 2017 సీజ‌న్ల‌లో అప్ప‌టి గుజ‌రాత్ ల‌య‌న్స్ టీమ్ కు ఊడా నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. అయితే జేస‌న్ రాయ్ లాగానే బిగ్ షాట్స్ ఆడ‌గ‌ల స‌త్తా ఉన్నోడ‌ని అత‌డిని తీసుకుంటే జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం చేకూరిన‌ట్ల‌వుతుంద‌ని టీం మేనేజ్ మెంట్ ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో రైనాను తీసుకుంటేనే బెట‌ర్ అనే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో దాదాపు సురేష్ రైనా బెర్త్ క‌న్ ఫ‌ర్మ్ అయిన‌ట్టేన‌ని భావించ‌క త‌ప్ప‌దు.

Also Read : భార‌త్ కు విజ‌యం మంధాన‌కు గాయం

Leave A Reply

Your Email Id will not be published!