Virat Kohli : కోహ్లీ మెరిసేనా సెంచ‌రీ సాధించేనా

భార‌త మాజీ కెప్టెన్ కు ఇది 100వ టెస్టు

Virat Kohli : భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంద‌రో ఆట‌గాళ్లు త‌మ‌దైన శైలిలో రాణించారు. అద్భుత‌మైన ప్ర‌తిభా పాటవాల‌తో క్రికెట్ కు కొత్త క‌ళ‌ను తీసుకు వ‌చ్చే ప్ర‌యత్నం చేశారు.

ఈ దేశంలో క్రికెట్ ను ఓ మ‌తంగా మార్చేసిన ఘ‌న‌త ఇద్ద‌రికే ద‌క్కుతుంది. ఒక‌రు 1983లో ప్ర‌పంచ క‌ప్ తీసుకు వ‌చ్చిన క‌పిల్ దేవ్ కాగా మ‌రొక‌రు టీమిండియాకు అన్ని ఫార్మాట్ ల‌లో అద్భుత విజ‌యాలు సాధించి పెట్టిన హైద‌రాబాదీ దిగ్గ‌జం మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్.

ఆ త‌ర్వాత స‌చిన్, ధోనీ దుమ్ము రేపారు. వారితో పాటు సైలంట్ గా వ‌చ్చి సెన్సేష‌న్ గా మారిన ఒకే ఒక్క‌డు విరాట్ కోహ్లీ(Virat Kohli). ఆట‌గాడిగా ప్ర‌పంచంలో ఏ ప్లేయ‌ర్ సాధించ‌ని రికార్డుల‌ను తిర‌గ రాశాడు.

ఆపై కెప్టెన్ గా ఏడున్న‌ర ఏళ్ల పాటు భార‌త జ‌ట్టును న‌డిపించాడు. ప్ర‌స్తుతం మ‌రో చ‌రిత్ర‌ను సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రపంచ క్రికెట్ ఫార్మాట్ లో ఇంత కాలం ఆడ‌టం అరుదు.

అంతే కాదు ఒక ఆట‌గాడు 100 టెస్టులు ఆడ‌టం చాలా అరుదు. అది కేవ‌లం కొద్ది మందికి మాత్ర‌మే ఆ అవ‌కాశం, అదృష్టం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు చేస్తూ స‌త్తా చాటుతున్నాడు.

త‌న కెరీర్ లో ప్రారంభం నుంచి నేటి దాకా నాలుగో స్థానంలో ఆడుతూ వ‌స్తున్నాడు కోహ్లీ. ఇక కెరీర్ లో 100 టెస్టులు ఆడిన 71వ క్రికెట‌ర్. 71వ అంత‌ర్జాతీయ సెంచ‌రీ సాధించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచ‌రీ సాధించాల‌ని క్రీడాభిమానులు కోరుతున్నారు.

Also Read : ప్ర‌పంచ క‌ప్ కోసం స‌ర్వం స‌న్న‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!