Fuel Price Hike : ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగుతోంది. దాని ప్రభావం భారత్ పై ఎక్కువగా పడనుంది. ఇప్పటికే ధరల మోతతో దద్దరిల్లి పోయేలా చేస్తున్న మోదీ ప్రభుత్వం మెల మెల్లగా పెట్రో వడ్డనకు సిద్దం అవుతోంది.
ఇప్పటికే గ్యాస్ తో పాటు ఆయిల్ ధరలు కొండెక్కాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , మణిపూర్ , గోవా, పంజాబ్ లలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇవాళ మణిపూర్ లో రెండో విడత పోలింగ్ జరుగుతుండగా యూపీలో ఇంకో విడత పోలింగ్ కొనసాగాల్సి ఉంది. కాగా ఆయా రాష్ట్రాలలో పోలింగ్ ముగిశాక ఈనెల 10న ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఒక వేళ ఆయిల్ ధరలు(Fuel Price Hike )పెంచితే గనుక ఓట్లు పడవనే ఉద్దేశంతో కేంద్రం నిలిపి వేసింది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఉక్రెయిన్ పై రష్యా దాడి బూచి చెప్పి పెంచడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
భారీ ఎత్తున లీటర్ కు పెంచనున్నారని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఫలితాలు వెలువడిన వెంటనే పెంచుకునేందుకు దేశంలోని చమురు సంస్థలకు ఆల్ రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే దేశంలోని సంస్థలను అమ్మకానికి పెట్టిన మోదీ ప్రభుత్వం ధరా భారం మోపడంలో మాత్రం ముందంజలో ఉంటోంది. ఇప్పటికే పెట్రో భారం తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నారు వాహనదారులు.
పెట్రో ధరలు పెరిగితే నిత్యావసరాల ధరలపై భారం పడనుంది. ఉక్రెయిన్ తో నెలకొన్న సంక్షోభం, పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఆయిల్ ధరలు పెంచడం తప్పడం లేదంటోంది కేంద్రం.
Also Read : అంకుర సంస్థలకు కేంద్రం సహకారం