Rahul Gandhi : దేశంలో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని రీతిలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పార్టీకి సరైన నాయకత్వం లేదని, దిశా నిర్దేశం చేసే లీడర్ లేక పోవడం వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ స్వంత పార్టీకి చెందిన సీనియర్లే అసమ్మతి స్వరం పెంచారు.
ప్రధానంగా వారంతా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ(Rahul Gandhi ), సోనియా గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పార్టీ కోసం శ్రమిస్తున్నారు. నిరంతరం రాహుల్ మోదీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
కానీ ఓట్లను రాబట్టడంలో విఫలమవుతున్నారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ (Rahul Gandhi )నేతృత్వంలో
ఘోరమైన పరాజయాన్ని చవి చూసింది. దాని దెబ్బకు రాహుల్ యూ టర్న్ తీసుకున్నారు.
నాకొద్దీ పార్టీ అంటూ వెళ్లి పోయారు. చివరకు మనసు మార్చుకున్నారు.
ఆయన లోక్ సభ వేదికగా చేసిన ప్రసంగం ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది.
కానీ ఎందుకనో ఓట్లను కొల్లగొట్టడంలో అనుసరిస్తున్న స్ట్రాటజీ వర్కవుట్ కావడం లేదు. తాజాగా ఢిల్లీ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది.
ప్రధానంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు ప్రజలు.
బీజేపీ తన నాలుగు రాష్ట్రాలను పదిలంగా చేజిక్కించుకుంటే కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల కారణంగా ఉన్న పంజాబ్ ను పోగొట్టుకుంది.
ఈ తరుణంలో మరోసారి అసమ్మతి నేతలు స్వరం విప్పారు. చివరకు రాహుల్ గాంధీకి బాసటగా పలువురు సీనియర్లు నిలబడ్డారు.
రాజస్థాన్ సీఎం గెహ్లాట్ అయితే రాహుల్ అయితేనే బెటర్ అంటూ ప్రకటించాడు కూడా.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి వచ్చే ఆగస్టు 20న ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించింది. మొత్తంగా చూస్తే రాహుల్ వైపు అత్యధిక నాయకత్వం మొగ్గు చూపడం విశేషం.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది.
పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టు మిట్టాడుతోంది.
ఈ బండిని లైన్ లో పెట్టాలంటే కత్తి మీద సాము లాంటిదేనని చెప్పక తప్పదు.
Also Read : కొడుకు ఎమ్మెల్యే తల్లి స్వీపర్