Ukraine Russia War : రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఎవరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు ఆ దేశాధ్యక్షుడు పుతిన్.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సైనిక చర్య పేరుతో దాడులకు తెగబడిన రోజే తేలి పోయింది యుద్ధ కాంక్ష తప్ప మరొకటి లేదని.
రాక్షసానందం పొందే వాళ్ల ముందు శాంతి ప్రవచనాలు వల్లిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. రష్యా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఓ వైపు అమెరికా , నాటో సేనలు తమ ఆధిపత్యం కోసం యత్నించాయి. ఇందుకు ఉక్రెయిన్ ను పావుగా వాడుకున్నాయి.
ఎలాంటి భేషజాలకు పోకుండా తన దేశం కోసం ప్రయత్నం చేస్తూ వస్తున్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చివరి క్షణం దాకా పోరాటం చేస్తూనే ఉన్నాడు.
ఈ ప్రపంచం అతడి ధైర్యాన్ని, దేశం పట్ల తనకు ఉన్న బాధ్యతను, నిబద్దతను చూసి విస్తు పోయింది.
ఇది పక్కన పెడితే ఆధిపత్య పోరు(Ukraine Russia War) కారణంగానే ఈ యుద్దానికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు.
అపారమైన వనరులకు పెట్టింది పేరు ఉక్రెయిన్. దీనిపై అమెరికా కన్నేసింది. తన పక్కనే ఉంటూ
తన కంట్లో నలుసుగా మారితే ఎలా అని మొక్కను పెరగకుండా ముందే తెంచేస్తే బెటర్ అని డిసైడ్ అయ్యాడు రష్యా చీఫ్ పుతిన్.
అమెరికా తో పాటు పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. కానీ రష్యా తగ్గలేదు. వెన్ను చూప లేదు. ముందుకే సాగుతోంది.
పుతిన్ రాజ్యకాంక్ష, యుద్ధ బీభత్సానికి (Ukraine Russia War)ప్రతీకగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. కానీ అమెరికా పుతిన్ ను యుద్ద నేరస్థుడిగా ప్రకటించింది. కానీ రష్యాను సపోర్ట్ చేస్తున్న చైనా చీఫ్ జిన్ పింగ్, మౌనంగా ఉంటూ మద్దతు ఇస్తున్న మోదీ,
అమెరికా చీఫ్ బైడెన్ కూడా యుద్ద నేరస్థులే. ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా ఈ మారణ హోమానికి పరోక్షంగా కారణమైన వీరంతా బాధ్యత వహించాల్సిందే.
ఇకనైనా పుతిన్ మారాలి. లేక పోతే యావత్ ప్రపంచం దూషించి, ద్వేషించే రోజు తప్పకుండా వస్తుంది. యావత్ లోకం నిన్ను పక్కన పెట్టిన రోజున ఎన్ని ఉండి ఏం లాభం. అమాయక పౌరులు, చిన్నారులను చంపే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రపంచం ప్రశ్నిస్తోంది.
Also Read : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే