Kavya Maran : కెమెరాలే కాదు క‌ళ్ల‌న్నీ అటు వైపే

ఎవ‌రీ కావ్య మార‌న్ ఏమిటా కథ

Kavya Maran : ముంబై వేదిక‌గా ఐపీఎల్ సంబురం మొద‌లైంది. ఇక మిగిలింది జ‌ట్ల మ‌ధ్య స‌మ‌రం. ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఎంతో ఉత్కంఠ‌కు తెర‌తీస్తోంది.

బ‌ల‌మైన జ‌ట్లుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ , ముంబై ఇండియ‌న్స్ ఉన్నా కేకేఆర్, ఆర్ఆర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్, ఆర్సీబీ సైతం స‌త్తా చాటేందుకు రెడీగా ఉన్నాయి. ఇక కొత్త జ‌ట్లు కూడా వ‌చ్చి చేరాయి.

ఇక ఐపీఎల్ అంటేనే కెమెరాలు కీల‌క పాత్ర పోషిస్తూ ఉంటాయి. అభిమానుల్ని, అంద‌మైన వాళ్ల‌పై ఫోక‌స్ పెడుతూ ఉంటాయి. గ‌త రెండేళ్లుగా ఒక‌రు మాత్రం హాట్ టాపిక్ గా మారారు.

ఆమె ఎవ‌రో కాదు యావ‌త్ క్రీడా లోకానికి ఇప్పుడు చిర ప‌రిచితురాలిగా మారి పోయారు కావ్య మార‌న్(Kavya Maran). స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ క‌మ్ చైర్మ‌న్ కూడా. ఒక‌ర‌కంగా చెప్పాలంటే అన్నీ కూడా. ఆమె దెబ్బ‌కు స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ జ‌ట్టు నుంచి నిష్క్ర‌మించాడు.

ఇక బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా వేలంలో సైతం కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. అక్క‌డ కూడా ఎంతో మంది ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం క‌ళ్ల‌న్నీ కావ్య పైనే ఉండ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

విచిత్రం ఏమిటంటే విండీస్ స్టార్ ప్లేయ‌ర్ సరైన్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది కావ్య మార‌న్(Kavya Maran). ఇక ఈసారి ఐపీఎల్ లో మ‌రోసారి కెమెరాల‌కు చిక్క‌నుంది.

ఇందు కోసం ఫ్యాన్సే కాదు కెమెరాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇక మీడియో మొఘ‌ల్ గా భావించే ద‌యానిధి మార‌న్ కూతురే ఈ కావ్య మార‌న్.

Also Read : సూర్య కుమార్ పై స‌న్నీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!