CSK vs KKR : నేడే స‌మ ఉజ్జీల మ‌ధ్య స‌మ‌రం

చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ కేకేఆర్

CSK vs KKR : ముంబై వేదిక‌గా ఇవాళ ఐపీఎల్ 2022 సంబురం ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంట‌ల‌కు డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (CSK vs KKR)మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాయి. ఇరు జ‌ట్లు పైకి బ‌లంగానే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ సీఎస్కే (CSK vs KKR)అన్నింట్లోనూ దూకుడు ప్ర‌ద‌ర్శించేలా ఉంది.

విచిత్రం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు నాయ‌క‌త్వం వ‌హించిన మ‌హేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ఉన్న‌ట్టుండి లీగ్ కు ముందు రిజైన్ చేశాడు.

ఆ జ‌ట్టుకు ధోనీ ప్లేస్ లో ర‌వీంద్ర జ‌డేజాను ఎంపిక చేసింది.

ఇక ఇయాన్ మోర్గాన్ ను త‌ప్పించి కేకేఆర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు స్కిప్ప‌ర్ గా ఛాన్స్ ఇచ్చింది.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) నుంచి ధోనీ, రాబిన్ ఊత‌ప్ప‌, ర‌వీంద్ర జ‌డేజా (కెప్టెన్ ) , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబ‌టి రాయుడు ఉన్నారు.

వీరితో పాటు దీప‌క్ చాహ‌ర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియ‌స్ , ముకేశ్ చౌద‌రి, సేనాప‌తి, ఆసిఫ్ , సాన్ ట్న‌ర్ , భ‌గ‌త్ వ‌ర్మ‌, నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ , హంగేర్క‌ర్ ఆడ‌తారు.

ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడ‌మ్ మిల్నే , హ‌రి నిశాంత్ , మ‌హీశ్ తీక్ష‌ణ‌, సోలంకి, సిమ్ర‌న్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడ‌తారు.

ఇక కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్ , స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు.

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

Also Read : మ్యాచ్ విన్న‌ర్ రిష‌బ్ పంత్

Leave A Reply

Your Email Id will not be published!