INDW vs SAW : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2022 లీగ్ మ్యాచ్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ ఇది భారత మహిళల జట్టుకు. ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన అరుదైన క్రికెటర్ మిథాలీ రాజ్(INDW vs SAW). ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ దుమ్ము రేపింది.
కెప్టెన్ గా ఉన్న మిథాలీ దుమ్ము రేపింది. 68 పరుగులు చేసి స్కోరును పరుగులెత్తించింది. మిథాలీతో పాటు షఫాలీ వర్మ, స్మృతి మంధాన సైతం సత్తా చాటారు.
ఈ ముగ్గురు కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన 15 ఓవర్లలో మొదటి వికెట్ కు 91 పరుగులు చేశారు.
53 పరుగుల వద్ద రనౌట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. 2 పరుగుల వద్ద యాస్తికా భాటియా వెనుదిరిగింది. వరుసగా వికెట్లు పడి పోయినా మంధాన, వర్మ సఫారీ బౌలర్లను అడ్డుకున్నారు.
మంధాన 71 పరుగుల వద్ద క్లో ట్రయన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ లో ముందుగా భారత జట్టు స్కిప్పర్ మిథాలీ రాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనది కావడంతో మ్యాచ్ చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగనుంది. భారత జట్టు రెండు మార్పులు చేసింది.
ఝులన్ గోస్వామికి బదులు మేఘనా సింగ్ రాగా, పూనమ్ యాదవ్ తరపున దీప్తి శర్మ ను తీసుకున్నారు. ఇక సౌతాఫ్రికా జట్టు తరపున మసాబటా క్లాస్ బరిలోకి దిగింది.
Also Read : ఈసారి కేకేఆర్ ను తట్టుకోవడం కష్టం