Surya Kumar Yadav : ‘సూర్య’ భాయ్ జీతే ర‌హో

స‌త్తా చాటినా ఓట‌మే

Surya Kumar Yadav  : ఎవ‌రీ సూర్య భాయ్ అనుకుంటున్నారా. టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా బిజినెస్ మెన్. ఇందులో సౌత్ ఇండియ‌న్ టాప్ హీరో మ‌హేష్ బాబు న‌టించాడు. ముంబై మాఫియాను ఎలా ఆడుకుంటాడో చెప్పే పాత్ర‌.

అందులో పాత్ర పేరు సూర్య భాయ్(Surya Kumar Yadav ). ఈ క్యారెక్ట‌ర్ గురించి ఎందుకు చెప్పాల్సి వ‌చ్చిందంటే ఐపీఎల్ 2022లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ముంబై ఇండియ‌న్స్ ఆడిన మ్యాచ్ గురించి చెప్పాలి.

ఒకానొక ద‌శ‌లో 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ముంబైని గ‌ట్టెక్కించాడు సూర్య కుమార్ యాద‌వ్ (Surya Kumar Yadav )అలియాస్ సూర్య భాయ్. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

కానీ జ‌ట్టు మాత్రం పేల‌వ‌మైన ఆట తీరుతో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. ఈ త‌రుణంలో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 151 ర‌న్స్ చేసింది. ఇందులో సూర్య కుమార్ యాద‌వ్ చేసింది 68 ప‌రుగులు.

ఇందులో 5 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి. బంతిని బాద‌డ‌మే పెట్టుకున్నాడు. ఓ వైపు ట‌పా ట‌పా వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా తొట్రు పాటుకు లోను కాకుండా స‌త్తా చాటాడు.

అద్భుత‌మైన షాట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు సూర్య భాయ్. ఇక 152 బ‌రిలోకి దిగిన ఆర్సీబీలో రావ‌త్ ఇదే స్థాయిలో రెచ్చి పోయాడు. త‌న జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

మొత్తం మీద ఐపీఎల్ లో ఎవ‌రో ఒక‌రు దుమ్ము రేపుతున్నారు. దంచి కొడుతున్నారు. అయితే ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్ చేరాలంటే ప్ర‌తీ మ్యాచ్ గెల‌వాల్సి ఉంటుంది.

Also Read : బెంగ‌ళూరు వ‌ర్సెస్ ముంబై

Leave A Reply

Your Email Id will not be published!