#SonaliBendre : దేవుడు కరుణిస్తాడని సోనాలి ఆరోగ్యాంగానే ఉందని
బతుకును జయించిన విజేత
Sonali Bendre : చెరగని చిరునవ్వు. జీవితం పట్ల అచంచలమైన నమ్మకం. ఇంకొకరైతే ఇప్పటికే భయపడి పోయే వారు. కానీ వేలాది మంది అభిమానుల మనసు దోచుకున్న సినీ నటీమణి, సోగకళ్ల సుందరీమణి సోనాలి బెంద్రే మాత్రం చెక్కు చెదరలేదు. అదర లేదు..బెదర లేదు. ఉన్నట్టుండి ఈ అందమైన, అద్భుతమైన నటిని క్యాన్సర్ అనే భూతం కమ్మేసింది.
ఆ విషయం లేటుగా తెలిసింది. ఒక్కసారిగా ఆ వార్త వైరల్ గా మారింది. ఔనా ఇది నిజమేనా అంటూ దేశమంతటా చర్చ. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ సోనాలి..జనం ముందుకు వచ్చారు. నిజమేనని ఒప్పుకున్నారు. మీ ఆదరాభిమానాల ముందు నాకు వచ్చిన వ్యాధి చిన్నదేనని నేను అనుకుంటున్నాను.
నేను మళ్ళీ తిరిగి వస్తాను నా మాతృభూమికి. నాకు ప్రాణం పోసింది ఈ నేల. ఇక్కడ ఉన్నంత అభిమానం. స్వేచ్ఛ ఇంకెక్కడా దొరకదు. కష్ట కాలంలో నా కుటుంబం నా వెంటే ఉన్నది. ఇందుకు నేను నా అభిమానులకు, తోటి నటీనటులకు, దర్శకులకు, ఫ్యామిలీకి నేను రుణపడి వుంటాను. నాకు నా మీద పూర్తిగా నమ్మకం ఉన్నది.
అదేమిటంటే నేను సంపూర్నంగా, ఎప్పటి లాగే నవ్వుతూ నేను మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను అని సోనాలి ఎంతో భావోద్వేగంతో చెప్పింది. ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తి కలిగించాయి. అంతకు ముందు క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఇదే భయంకరమైన వ్యాధికి లోనయ్యాడు.
త్వరలోనే కోలుకుని ఇండియాకు వచ్చాడు. రాగానే ఇండియా జట్టుకు ఆడాడు. ఇక సోనాలి అంటే అటు బాలీవుడ్ కే కాదు ఇటు తెలుగు వారికి చెప్పలేనంతటి అభిమానం. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు కొన్నే అయినప్పటికీ ఇప్పటికీ ఆ సినిమాలు ఆయా ఛానల్స్ లలో టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి.
అందులో మహేష్ బాబు తో నటించిన మురారి, అక్కినేని నాగార్జున తో కలిసి నటించిన మన్మధుడు(Sonali Bendre) మూవీస్. ఎవరు గ్రీన్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి. మన్మధుడు అయితే కొన్ని వందల సార్లు మా టీవీలో ప్రసారం అయ్యింది. వన్నె తగ్గని అందం, మరిచి పోలేని చిరునవ్వు. లేత కొమ్మలాంటి పెదవులు.
అంతకంటే ఎక్కువగా ఆకట్టుకునే ప్రశాంతంగా వుండే మోము కలిగిన సోనాలి ఇవ్వాళ అంతే కూల్ గా దర్శనమిచ్చారు. సోనాలి(Sonali Bendre)..నటినే కాదు ఎందరికో స్ఫూర్తి కూడా. కష్టకాలంలో గుండె ధైర్యాన్ని నింపుకున్న ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తాను హెల్తీగానే ఉన్నట్టు ట్విట్టర్ లో ఫోటో పెట్టారు. మళ్ళీ సోనాలి ఎప్పటిలాగానే అగుపించింది. నెటిజన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ రకంగా తమ ప్రేమను చాటుకున్నారు.
No comment allowed please