TATA Products : మ‌రికొన్ని బ్రాండ్ ల‌పై క‌న్నేసిన టాటా

రిల‌య‌న్స్ కు పోటీగా కొనుగోలుకు రెడీ

TATA Products : భార‌త దేశ వ్యాపార రంగంలో అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్ గా టాటా గ్రూప్ నిలిచింది. విలువ‌లే ప్రామాణికంగా ముందుకు సాగుతోంది. ర‌త‌న్ టాటా ప్ర‌ధాన ఉద్దేశం దేశం స్వ‌యం స‌మృద్దిని సాధించడం. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా దేశాన్ని మ‌రిచి పోకూడ‌దంటారు.

వ‌స్తువులైనా లేదా ఇత‌ర ఏ సంస్థ అయినా ముందు వినియోగ‌దారులకు మెరుగైన సేవ‌లు అందించేందుకే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తారు. ఇటీవ‌లే ఆయ‌న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేశారు.

ఇక టాటా(TATA Products) ప్ర‌ధానంగా వినియోగ‌దారుల‌కు సంబంధించి టీ, సాల్ట్ , కాఫీని విక్ర‌యిస్తోంది. టాటా అంటేనే కార్లు, వాహ‌నాల త‌యారీ. ప్ర‌తి రంగంలో టాటా విస్త‌రించి ఉంది. తాజాగా మ‌రో ఐదు వినియోగ‌దారు బ్రాండ్ ల‌ను కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేస్తోంది టాటా గ్రూప్.

ఈ విష‌యాన్ని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్(TATA Products) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ డిసౌజా వెల్ల‌డించారు. రాబోయే 6 నెల్ల‌లో 60 చిన్న కిరాణా, గృహ వినియోగ వ‌స్తువుల బ్రాండ్ ల‌ను కొనుగోలు చేయాల‌ని యోచిస్తోంది.

ఇండియాలో ఇప్ప‌టికే యునిలివ‌ర్ , ముఖేష అంబానీకి చెందిన రిల‌య‌న్స ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థ‌లు క‌న్స్యూమ‌ర్స్ ప్రొడక్ట్స్

సెక్టార్ లో కొలువు తీరి ఉన్నాయి.

వినియోగ‌దారుల వ‌స్తువుల రంగంలో త‌న స్థానాన్ని పెంపొందిచు కునేందుకు కొనుగోలు చేయాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ఇప్ప‌టికే దేశంలో టాప్ 5 ప్రొడ‌క్ట్స్ ను చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

ప‌లు కంపెనీల‌తో వాటాలాను కొనుగోలు చేసింది టాటా గ్రూప్. క‌రోనా త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో దేశ వ్యాప్తంగా స్టార్ బ‌క్స్ కార్పొరేష‌న్

అవుట్ లెట్ ల విస్త‌ర‌ణ‌ను వేగ‌వంతం చేశారు.

50 కొత్త కేఫ్ ల‌ను ఏర్పాటు చేసింది. 26 న‌గ‌రాల్లో 268 స్టోర్ల‌ను ఏర్పాటు చేసింది. దేశంలో 1000 కంటే ఎక్కువ స్టార్ బ‌క్స్ అవుట్ లెట్ ఉండాల‌ని చూస్తోంది.

Also Read : మీడియా సెక్టార్ లోకి అదానీ ఎంట్రీ

Leave A Reply

Your Email Id will not be published!