LPG Cylinder Hike : బండ బడ మళ్లీ గ్యాస్ గుది బండ
మంట పెడుతున్న వంట గ్యాస్
LPG Cylinder Hike : స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మన్ కీ బాత్, మేరా భారత్ మహాన్ అన్న పదాలు మోదీ ప్రభుత్వం కొలువు తీరాక జనాలకు బాగా అలవాటుగా మారాయి.
ఓ వైపు కరోనా ఇంకో వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరిగిన వలసలు, నిత్యావసర ధరలు జనాన్ని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే మోయలేనంత భారాన్ని చమురు కంపెనీలు మోపాయి. పెట్రోల్, డీజిల్ ఎక్కడా లేని రీతిలో పెంచాయి. ఇంకా పెంచేందుకు రెడీగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మడమో లేదా లీజుకు ఇవ్వడం చేయడం ప్రారంభించిందో ఆ నాటి నుంచి పూర్తి బాధ్యతల నుంచి తప్పుకుంటూ వస్తోంది.
ఇందులో భాగంగానే ఆయిల్ , గ్యాస్ కంపెనీలపై నియంత్రణను కోల్పోవడం. మోదీ ప్రభుత్వం రాక ముందు దేశంలో వినియోగదారులు వాడే వంట గ్యాస్ రమారమి రూ.411 దాకా ఉండేది.
ఇప్పుడది రూ. 1100కి చేరింది. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినా కేంద్ర సర్కార్ పట్టించు కోవడం లేదు. ఇది తమ తప్పు కాదని గతంలో ఏలిన వారిదేనంటూ దాట వేస్తోంది.
అంతే కాదు కరోనా, ఉక్రెయిన్ రష్యా యుద్దం, ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణాలుగా చూపుతోంది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల కంటే ముందు తగ్గిస్తూ వచ్చిన సర్కార్ ఎన్నికల ఫలితాలు వచ్చాక బాదడం మొదలు పెట్టింది.
ప్రస్తుతం దేశంలో ఉప్పు నుంచి ప్రతి సరుకు మంట మండుతోంది. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గురువారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్(LPG Cylinder Hike) ధర రూ. 3.50 పైసలు పెరగగా వాణిజ్య సిలిండర్ ధర రూ. 8కి పెంచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లలో సిలిండర్ ధర రూ. 1,000 దాటేసింది.
కమర్షియల్ సిలిండర్ ధర పెరిగిన వాటితో కలుపుకుంటే ఢిల్లీ లో రూ. 2, 254 కాగా ముంబైలో 2, 305 రూపాయలు. చెన్నైలో రూ. 2, 507గా ఉంది.
Also Read : మరికొన్ని బ్రాండ్ లపై కన్నేసిన టాటా