Joe Root : 10 వేల ప‌రుగుల క్ల‌బ్ లో జో రూట్

ఇంగ్లండ్ క్రికెట్ హిస్ట‌రీలో రెండో క్రికెట‌ర్

Joe Root : స్వ‌దేశంలో లార్డ్స్ లో న్యూజిలాండ్ తో జ‌రిగిన తొలి టెస్టులో అజేయ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్. కెప్టెన్ బెన్ స్టోక్స్ , వికెట్ కీప‌ర్ తో క‌లిసి జ‌ట్టును గ‌ట్టెక్కించాడు.

విజ‌యం సాధించేలా కీల‌క పాత్ర పోషించాడు. ఇదే స‌మ‌యంలో 37 ఏళ్ల 154 రోజుల త‌ర్వాత జో రూట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

జో రూట్(Joe Root) టెస్ట్ కెరీర్ లో 10,000 ప‌రుగులు పూర్తి చేశాడు.

రెండో ప్లేయ‌ర్ గా నిలిచాడు. 2012 డిసెంబ‌ర్ 13న భార‌త్ తో తొలి టెస్టు ప్రారంభించాడు. 30 డిసెంబ‌ర్ 1990లో ఇంగ్లాండ్ లో పుట్టాడు జో రూట్. అనేక సీజ‌న్ల‌లో యార్క్ షైర్ లీగ్ లో ఆడాడు. క్రికెట్ లో ప‌రిణ‌తి సాధించాడు.

2010లో బంగ్లాదేశ్ అండ‌ర్ -19కి వ్య‌తిరేకంగా ఇంగ్లండ్ అండ‌ర్ -19 త‌ర‌పున ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది సీరీస్ ఎంపిక‌య్యాడు. 2011 ప్రారంభంలో కౌంటీ చాంపియ‌న్ షిప్ అరంగేట్రం చేసిన రూట్ త‌నను తాను న‌మ్మ‌ద‌గిన బ్యాట‌ర్ గా మారాడు.

హాంప్ షైర్ తో అజేయంగా 222 ర‌న్స్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. నాగ్ పూర్ లో జ‌రిగిన మ్యాచ్ లో ర‌వి అశ్విన్, జ‌డేజా, చావ్లా, ప్ర‌జ్ఞాన్ ఓజా ల‌ను త‌ట్టుకుని 289 నిమిషాల పాటు ఆడాడు 73 ర‌న్స్ చేశాడు జో రూట్(Joe Root).

రూట్ టెస్ట్ లు, వ‌న్డేలు, టీ20ల‌లో త‌న‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. 2013లో యాషెస్ సీరీస్ లో టాప్ లో నిలిచాడు. లార్డ్స్ లో 180 ర‌న్స్ చేసి రాణించాడు. 3-0తో సీరీస్ చేజిక్కించుకుంది ఇంగ్లాండ్.

అనంత‌రం జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో కూడా అద్భుతంగా ఆడాడు. 173 ర‌న్స్ సాధించాడు. విండీస్ టూర్ లో వ‌న్డే సీరీస్ లో టాప్ లో నిలిచాడు జో రూట్. 2014లో లార్డ్స్ లో శ్రీ‌లంక‌తో అజేయంగా 200 ర‌న్స్ చేశాడు.

భార‌త్ పై మ‌రో రెండు సెంచ‌రీలు సాధించాడు. 2015లో 460 ప‌రుగులు చేసి టాప్ లో నిలిచాడు.

Also Read : జో రూట్ సెంచ‌రీ ఇంగ్లాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!