IPL Amazon : త‌ప్పుకున్న అమెజాన్ రిల‌య‌న్స్ కు చాన్స్

ఐపీఎల్ డిజిట‌ల్, మీడియా వేలం పాట‌లో నాలుగు

IPL Amazon : యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) డిజిట‌ల్ , మీడియా ఐదేళ్ల ప్ర‌సార హ‌క్కుల కోసం ప్ర‌క‌టించిన బిడ్ ( వేలం పాట‌) నుంచి అనూహ్యంగా అమెజాన్(IPL Amazon) త‌ప్పుకుంది.

బ‌రిలో నిలిచి రిల‌య‌న్స్ కు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అనుకున్న‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో త‌ప్పు కోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో భార‌త వ్యాపార రంగాన్ని శాసిస్తూ వ‌స్తున్న రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌కు చెందిన వ‌యా కామ్ 18 బ‌రిలో నిలిచింది.

ఆ సంస్థ‌తో పాటు డిస్నీ స్టార్ , సోనీ జీ సంస్థ‌లు ప్రాథ‌మిక పాల్గొన్నాయి. ఇదిలా ఉండ‌గా బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకున్న వాటిలో అమెజాన్ తో పాటు గూగుల్ యూట్యూబ్ కూడా ఉంది.

కానీ ద‌ర‌ఖాస్తు చేయ‌లేదు. ఈనెల 12న ఆదివారం ఈ వేలం ప్రారంభం కానుంది. ఇక బిడ్ ప్రారంభ ధ‌ర రూ. 32 కోట్ల నుంచి స్టార్ట్ కానుంది.

ఒక వేళ పోటీ ఎక్కువైతే క‌నీసం రూ. 45,000 వేల కోట్ల‌కు పైగా బీసీసీఐకి రానుందని అంచ‌నా. ఇప్ప‌టి దాకా స్టార్ చేతిలో ఉంది. భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది.

మొత్తం నాలుగు ప్యాకేజీలుగా బీసీసీఐ విభ‌జించింది ఈ వేలం పాట‌ను. కాగా ఈసారి డిజిట‌ల్ విభాగంలో టైమ్స్ ఇంట‌ర్నెట్, ఫ‌న్ ఆసియా, డ్రీమ్ 11, ఫ్యాన్ కోడ్ , స్కై స్పోర్ట్స్ , సూప‌ర్ స్పోర్ట్స్ బ‌రిలో ఉన్నాయి.

మొత్తంగా రూ. 45 వేల నుంచి రూ. 50 వేల కోట్లు రానున్నాయి బీసీసీఐకి.

Also Read : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ‘మాలిక్’ వ‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!