Akash Ambani : జియోకు ముఖేష్ అంబానీ రాజీనామా
కొత్త చైర్మన్ గా ఆకాష్ అంబానీ
Akash Ambani : ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. దేశంలోనే టాప్ టెలికాం కంపెనీగా పేరొందిన రిలయెన్స్ జియో కంపెనీకి చైర్మన్ గా ఇప్పటి వరకు ఉన్నారు.
మంగళవారం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను జియో చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రిలయన్స్ జియో బోర్డు నుండి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.
కంపెనీ నాయకత్వాన్ని తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ముఖేష్ అంబానీ(Akash Ambani) స్థానంలో కొత్తగా ఆకాష్ బాధ్యతలు చేపట్టారు. ఇక నుంచి ఆకాశ్ అంబానీ చైర్మన్ గా కొనసాగనున్నారు.
65 సంవత్సరాల ముఖేష్ అంబానీ బిలియనీర్ వారసత్వంగా భావించే రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ఇన్ఫో కామ్ బోర్డు చీఫ్ ఇక నుంచి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈనెల 27 నుంచి కంపెనీ డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇదిలా ఉండగా రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ , రెగ్యులేటరీ ఫైలింగ్ లో , కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ నియామకాన్ని ఆమోదించింది.
ఇక ఆకాష్ అంబానీతో పాటు మరికొందరిని ఎంపిక చేసింది బోర్డు. పంక్ మోహన్ పవార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఐదేళ్ల పదవీ కాలం జూన్ 27న ప్రారంభమైంది.
కేవి చౌదరి, రమీందర్ సింగ్ గుజ్రాల్ స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇక ముఖేష్ అంబానీ ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీగా , రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ తో సహా అన్ని జియో డిజిటల్ సేవల బ్రాండ్ ల మాతృసంస్థ అయిన జియో ప్లాట్ ఫారమ్ ల చైర్మన్ గా కొనసాగుతారు.
Also Read : అంకురాలకు టీ హబ్ ఆలంబన