Eoin Morgan : ఆటకు వీడ్కోలు చెప్పిన స్టార్ క్రికెటర్
అధికారికంగా ప్రకటించిన ఇయాన్ మోర్గాన్
Eoin Morgan : అంతా ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ తను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ వచ్చిన క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. నిన్నటి నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఇంగ్లండ్ మీడియా కోడై కూసింది.
బీబీసీ అయితే ముందుగానే ఈనెల 28న తను తప్పుకుంటాడని ప్రకటించింది. ఆ మేరకు ఏది ఏమైనా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన ఆటగాడిగా మోర్గాన్ నిలిచి పోతాడు.
అతడి సారథ్యంలో చిరస్మరణీయమైన, గుర్తు పెట్టుకోదగిన విజయాలను సాధించింది. మిగతా వాళ్లను తక్కువ చేయడం అని కాదు. కానీ ఇంగ్లండ్ జట్టుకు యువ రక్తాన్ని తీసుకు రావడంలో, ప్రోత్సహించడంలో ఇయాన్ మోర్గాన్ చేసిన కృషి గొప్పది.
గాయం కారణంగా, ఫిట్ నెస్ కోల్పోవడంతో ఇక ఆట నుంచి నిష్క్రమించడమే మేలని అనుకున్నాడు. ఊహించని రీతిలో తన నిర్ణయాన్ని
ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా డిక్లేర్ చేశాడు.
తక్షణమే ఇది అమలు లోకి వస్తుందని స్పష్టం చేశాడు ఇయాన్ మోర్గాన్(Eoin Morgan). ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ లో తాను
ఏది ఆడాలని అనుకున్నానో అలాగే ఆడానని, తనకు సహకరించిన క్రికెట్ బోర్డుకు, కెప్టెన్లకు, సహచరులకు, ఇతర దేశాల ఆటగాళ్లకు కూడా ధన్యవాదాలు తెలిపాడు.
ప్రత్యేకించి ప్రపంచ వ్యాప్తంగా తనను అభిమానించే ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇయాన్ మోర్గాన్ ఆటగాడు మాత్రమే కాదు గొప్ప ఇన్నోవేటర్ అని పేర్కొంది. ఇంగ్లీష్ క్రికెట్ రూపు రేఖలను మార్చాడని కితాబు ఇచ్చింది.
క్రికెటర్..మోటివేటర్ ..ఓ ఛాంపియన్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. 13 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. 248 వన్డేలు, 115 టీ20లు 16 టెస్టులు ఆడాడు.
ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ కు వరల్డ్ కప్ అందించాడు 2019లో.
Also Read : ఇంగ్లండ్ టెస్టు జట్టు డిక్లేర్