Mani Ratnam : భారతీయ సినీ రంగంలో దిగ్గజ దర్శకుడిగా పేరొందిన మణిరత్నంకు(Mani Ratnam) అరుదైన పురస్కారం లభించింది. ఇప్పటికే ఆయనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి.
తాజాగా మహారాష్ట్రం లోని పుణేకు చెందిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ గత 18 సంవత్సరాలుగా దేశంలో వివిధ రంగాలలో ప్రతిభా పాటవాలకు చెందిన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రకటిస్తుంటుంది.
మణిరత్నంకు ఈ విశ్వవిద్యాలయం భారత్ అస్మిత రాష్ట్రీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
ఇవాళ అధికారికంగా ధ్రువీకరించింది ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ.
ఈ ఏడాది భారతీయ సినీ రంగం నుంచి తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు మణిరత్నంనుMani Ratnam) ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఈ అవార్డులను భారత్ అస్మిత్ ఫౌండేషన్ తో పాటు ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నరమెంట్ సంయుక్తంగా అందజేస్తూ వస్తోంది.
ఇవాళ సామాజిక వేదిక ద్వారా నిర్వహించనున్న కార్యక్రమంలో మణిరత్నంకు అవార్డును బహూకరిస్తారు.
ఇదిలా ఉండగా మణిరత్నం తెలుగు, తమిళ, హిందీ సినీ రంగాలకు బాగా పరిచయం.
ప్రముఖ సంగీత దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) తీసిన రోజా మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత అతడికి ఎదురు లేకుండా పోయింది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం సతీమణి. ఆయన నాగార్జునతో తీసిన గీతాంజలి సెన్సేషన్ హిట్. ఎన్నో సినిమాలు దేశాన్ని ఒక ఊపు ఊపాయి.
బొంబాయి దుమ్ము రేపింది. కాగా మణిరత్నం తీసిన ప్రతి చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. ఇక ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీయే చదివాడు.
మొదటి సినిమా కన్నడలో పల్లవి అనుపల్లవి పేరుతో తీశాడు. ఆయనకు తాను తీసిన చిత్రాలలో నచ్చిన మూవీ ఇద్దరు. కడలి తీశాడు. అది సినీ ప్రేక్షకులను కట్టి పడేసింది. ప్రస్తుతం మణిరత్నంకు 66 ఏళ్లు.
Also Read : సర్కార్ వారి పాట’ రిలీజ్ కు రెడీ