Draupadi Murmu : అడవి బిడ్డకు అరుదైన గౌరవం
జూనియర్ అసిస్టెంట్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా
Draupadi Murmu : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు ద్రౌపది ముర్ము. గిరిజన ఆదివాసీ ప్రాంతానికి చెందిన ద్రౌపది ముర్ము(Draupadi Murmu) దేశంలోనే అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపికయ్యారు.
అత్యంత సౌమ్యురాలిగా పేరొందారు. మొదట జూనియర్ అసిస్టెంట్ గా ప్రారంభమైన ఆమె ప్రస్థానం రాష్ట్రపతి దాకా చేరింది. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందింది మయూర్ భంజ్ .
ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. గిరిజన సంతాల్ తెగకు చెందిన వ్యక్తి ద్రౌపది ముర్ము(Draupadi Murmu). ఆమె జూన్ 20, 1958లో పుట్టారు. తండ్రి బిరంచి నారాయణ్ తుడుది పేద కుటుంబం.
ఆమెకు చిన్నప్పటి నుంచి చదువంటే ఇష్టం. అష్టకష్టాలు పడ్డారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు.
అనంతరం ఒడిశా రాష్ట్ర నీటి పారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. 1997లో రాయ్ రంగాపూర్ లో పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.
ఆనాటి నుంచే రాజకీయ జీవితం మొదలైంది. 2000లో ఒడిశాలో బిజూ జనతాదళ్ , భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు.
రవాణా, వాణిజ్య, మత్స్య, పశు సంవర్దక శాఖలు చేపట్టారు. ఆమె బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చాకు అధ్యక్షురాలిగా ఉన్నారు.
బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆ పని చేశారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ గా ఎంపికయ్యారు. ఆ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ కావడం విశేషం.
Also Read : రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ బిడ్డ ‘ముర్ము’