Aakash Chopra : ఆ జట్టు విజయాల్లో అతడే కీలకం
రాహుల్ త్రిపాఠిపై ఆకాశ్ చోప్రా కామెంట్
Aakash Chopra : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాంచీ కుర్రాడు రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడాడు.
ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆపై 76 కీలక పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఈ సందర్భంగా ఫుల్ జోష్ మీదుకున్న త్రిపాఠిపై భారత జట్టు మాజీ ప్లేయర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయాలలో రాహుల్ త్రిపాఠి కీలక పాత్ర పోషించాడంటూ కితాబు ఇచ్చాడు.
ఆ జట్టుకు అతడే టార్చ్ బేరర్ గా మారాడని పేర్కొన్నాడు. ప్రత్యర్థులు ఎంతటి బౌలర్లైనా సరే దాడి చేయడమే పనిగా పెట్టుకున్నాడని తెలిపాడు. తనకు ఇష్టమైన అన్ క్యాప్డ్ ప్లేయర్లలో రాహుల్ త్రిపాఠి ఒకడని పేర్కొన్నాడు.
ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే విధిగా ఈ మ్యాచ్ గెలవాల్సిన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు త్రిపాఠి. రాంచీ ఆటగాడికి ప్రియమ్ గార్గ్ కూడా తోడయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది.
రాహుల్ త్రిపాఠి కేవలం 44 బంతులు మాత్రమే ఎదుర్కొని 76 రన్స్ చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు 9 ఫోర్లు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే త్రిపాఠి ఆడినప్పుడు మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తూ వచ్చిందని పేర్కొన్నాడు ఆకాశ్ చోప్రా.
అటు స్పిన్నర్లు ఇటు పేసర్లు ఎవరు ఉన్నా లెక్క చేయకుండా ఆడడం ఒక్క త్రిపాఠికి మాత్రమే చెల్లిందన్నాడు ఆకాశ్ చోప్రా.
Also Read : స్వదేశానికి కేన్ మామ పయనం