ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ఇందులో భాగంగా 100 ఎపి సోడ్స్ పూర్తి చేసుకుంది. దీనిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మన్ కీ బాత్ @100 పేరుతో జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 100 మంది ప్రముఖులు పాల్గొనున్నారు.
ఈ మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ 3, 2014లో ప్రారంభమైంది. ఇది జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతదేశ అభివృద్ది ప్రయాణంలో పాల్గొనేందుకు లక్షల మందికి ప్రేరణగా నిలిచారు. ఇందులో భాగంగా విజయాలు, సంతోషాలు, గర్వించ దగిన వ్యక్తులను పరిచంయ చేస్తూ వచ్చారు ప్రధానమంత్రి.
దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్ లో ప్రసార భారతి కాన్ క్లేవ్ ను నిర్వహించనుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ప్రారంభ సెషన్ ను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ నటులు అమీర్ ఖాన్, రవీనా ఠాండన్ హాజరు కానున్నారు.
దేశ నిర్మాణంలో విశేషమైన కృషిని పీఎం తన నెలా వారీ ప్రసారంలో ప్రశంసించారు. సాంప్రదాయ కళ, సంస్కృతి, హస్త కళలను ప్రోత్సహించిన వారు, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ రంగాలలో పని చేస్తున్న వారిని ప్రస్తావించారు. సవాళ్లను పరిష్కరించేందుకు వినూత్న పరిష్కారాలను అందించిన వారున్నారు.