AAP Councillor Joins : ఆప్ కౌన్సిల‌ర్ బీజేపీలోకి జంప్

కొలిక్కి రాని స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు

AAP Councillor Joins : ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంసీడీ) ఎన్నిక‌లు ముగిశాయి. కానీ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు ఆరుగురు స్టాండింగ్ స‌భ్యుల ఎన్నికపై రాద్దాంతం చోటు చేసుకుంది. మూడుసార్లు ఎన్నిక వాయిదా ప‌డింది. చివ‌ర‌కు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవ‌డంతో ఎట్ట‌కేల‌కు తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్య మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ రెండు కీల‌క ప‌ద‌వులు పూర్తిగా ఆప్ స్వంతం అయ్యాయి.

ఇదే స‌మ‌యంలో స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎంపిక‌పై రాద్దాంతం చోటు చేసుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల‌కు దిగారు. దీంతో ఎన్నిక వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కొత్త‌గా ఎన్నికైన మేయ‌ర్ షీలా ఒబెరాయ్. ఈ కీల‌క స‌మ‌యంలో ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ఆప్ కు. ఆ పార్టీకి చెందిన ఆప్ కౌన్సిల‌ర్(AAP Councillor Joins) ఉన్న‌ట్టుండి భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయ్యారు. ఢిల్లీ మ‌హా న‌గ‌ర కార్పొరేష‌న్ స‌భ్యుల ఎన్నిక అర్ధ‌రాత్రి హై డ్రామా చోటు చేసుకుంది.

ఢిల్లీకి చెందిన కౌన్సిల‌ర్ ప‌వ‌న్ సెహ్రావ‌త్ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా ఆప్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆప్ లో అవినీతి చోటు చేసుకుంద‌ని, అక్ర‌మాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌వానాకు చెందిన ఆప్ కౌన్సిల‌ర్ ను పార్టీ ఢిల్లీ యూనిట్ కార్యాయంలో బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర స‌చ్ దేవా, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌ర్ష్ మ‌ల్హోత్రా బీజేపీలోకి ఆహ్వానించారు.

Also Read : రాహుల్ కామెంట్స్ మ‌హూవా సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!