Atishi Wrestllers : అనురాగ్ ఠాకూర్ పై ఆప్ ఆగ్రహం
మహిళా రెజ్లర్ల ఆందోళనకు మద్దతు
Atishi Wrestllers : కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ పై నిప్పులు చెరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ 9 మంది మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు వారికి మద్దతు తెలిపారు. సపోర్ట్ చేసిన వారిలో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ కూడా ఉన్నారు.
ఆప్ మంత్రి అతిషి మహిళా రెజ్లర్ల వద్దకు చేరుకున్నారు. వారికి ఆప్ తరపున మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై నిప్పులు చెరిగారు. మంత్రిగా ఉంటూ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు. గత కొంత కాలంగా వేధింపులకు పాల్పడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోందంటూ మండిపడ్డారు మంత్రి అతిషి(Atishi Wrestllers).
అనురాగ్ ఠాకూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో మహిళా క్రీడాకారులు తమకు రక్షణ కల్పించాలని కోరడం దారుణమన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఠాకూర్ ఫెయిల్ అయ్యారని, సిగ్గుతో తల వంచు కోవాలని పేర్కొన్నారు. వెంటనే బీజేపీ నుంచి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆప్ మంత్రి అతిషి. ఇదిలా ఉండగా అతిషి చేసిన కామెంట్స్ ను ఖండించింది బీజేపీ.
Also Read : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ పై కేసులు