Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ !
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ !
Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని(Abhishek Singhvi) కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు.
Abhishek Singhvi…
రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్ తస(బిజెపి), మీసా భారతి (ఆర్జేడీ), వివేక్ ఠాకుర్ (బిజెపి), దీపేంద్రసింగ్ హుడా (కాంగ్రెస్), ఉదయన్ రాజే భోస్లే (బిజెపి), కె.సి.వేణుగోపాల్ (కాంగ్రెస్), బిప్లబ్ కుమార్ దేబ్ (బిజెపి) లోక్సభకు ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో భారాస తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
Also Read : Parvathaneni Harish: ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం !