ACA Offer : అమరావతి – ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. నవంబర్ 15న ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున టికెట్లు అమ్ముడు పోయాయి. నువ్వా నేనా అన్న రీతిలో ఇరు జట్లు తలపడనున్నాయి.
ACA Offer For Cricket Match
ఇప్పటి దాకా భారత జట్టు ఆడిన 9 మ్యాచ్ లలోను విజయం సాధిస్తూ వస్తోంది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. మరోవైపు ఎలాగైనా సరే టీమిండియా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేయాలని న్యూజిలాండ్ కంకణం కట్టుకుంది.
ఇరు జట్లు బలంగా ఉన్నాయి. రేపు జరిగే మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ వ్యాప్తంగా ఆయా క్రికెట్ అసోసియేషన్లు ఈ మ్యాచ్ ను ఉచితంగా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.
తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు సెమీస్ మ్యాచ్ సందర్భంగా విశాఖ పట్నం, విజయవాడ, కడప నగరాలలో భారీ స్క్రిన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో చోట కనీసం 10 వేల మందికి పైగా మ్యాచ్ ను వీక్షించేందుకు వీలుందని ఏసీఏ వెల్లడించింది.
Also Read : Tummala Nageswara Rao : నేను గెలిస్తే ఏపీలో బాబు గెలిచినట్టే