Posani Krishna Murali : పోసాని కృష్ణ ముర‌ళికి క‌రోనా

మూడోసారి క‌రోనా పాజిటివ్

Posani Krishna Murali : ప్ర‌ముఖ న‌టుడు, ఏపీ ఫిలిం డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోసాని కృష్ణ ముర‌ళికి క‌రోనా సోకింది. వ‌రుస‌గా ఆయ‌న‌కు క‌రోనా రావ‌డం ఇది మూడోసారి కావ‌డం విశేషం. షూటింగ్ ముగించుకుని వ‌చ్చిన పోసానిని వెంట‌నే హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి స‌ర్కిల్ లో ఉన్న ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. పూణేలో ఓ సినిమాకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారు. హైద‌రాబాద్ కు వ‌చ్చిన పోసాని కృష్ణ మురళికి టెస్టులు చేయ‌డంతో పాజిటివ్ అని తేలింది.

ఇదిలా ఉండ‌గా మొద‌టి నుంచీ పోసాని సెటైర్లు వేయ‌డంలో, మాట‌ల్ని తూటాలుగా పేల్చ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. వారం రోజుల కింద‌ట నంది అవార్డుల ఎంపిక‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో నంది అవార్డుల ఎంపిక‌పై అనేక అనుమానాలు, అపోహ‌లు ఉన్నాయ‌ని చెప్పారు. కులాల వారీగా, గ్రూపుల వారీగా గ‌తంలో పుర‌స్కారాల‌ను పంచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali).

అంతే నంది అవార్డులు కాద‌ని క‌మ్మ అవార్డులంటూ ఎద్దేవా చేశారు. పుర‌స్కారాల ఎంపిక క‌మిటీలో మొత్తం 12 మంది స‌భ్యులు ఉండ‌గా వారిలో 11 మంది క‌మ్మ వారే ఉన్నారంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా పోసాని ఆస్ప‌త్రిలో చేర‌డంతో విష‌యం తెలుసుకున్న సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి పోసాని ఆరోగ్యంపై ఆరా తీశారు.

Also Read : స‌మంత రియ‌ల్ ఫైట‌ర్ – దేవ‌ర‌కొండ‌

Leave A Reply

Your Email Id will not be published!