Taraka Ratna Haints : తారకరత్న ఆరోగ్యం పదిలం
గుండె పోటుకు గురైనట్లు నిర్ధారణ
Taraka Ratna Haints : నటుడు నందమూరి తారకతర్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రాణాపాయం నుంచి గట్టెక్కినట్లు తెలిపారు. తారకరత్న పరిస్థితి కేసీ ఆస్పత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ ఉదయం ఆయన గుండె పోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. తదుపరి చికిత్స కొనసాగుతుందని వెల్లడించింది.
ఆస్పత్రికి తీసుకు వచ్చిన సమయంలో తారకరత్న స్పృహలో లేరని తెలిపింది. పల్స్ రేట్ కూడా తక్కువగా ఉందని , ఆ వెంటనే సమస్యను గుర్తించి సీపీఆర్ చేశామని పేర్కొంది. దీంతో పల్స్ రేట్ మెరుగు పడిందని పేర్కొన్నారు ఆస్పత్రి వైద్యులు. కుటుంబీకుల సూచనల మేరకు వేరే ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పంలోని పీసీఎస్ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. యాంజియోగ్రామ్ చేశారు వైద్యులు. ఇదిలా ఉండగా గుండెకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్ లు ఏర్పడినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇవాళ ఉదయం నందమూరి తారకరత్నకు (Taraka Ratna) గురవడానికి ప్రధాన కారణం గుండె పోటేనని నిర్ధారించారు.
అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని , ప్రాణపాయం నుంచి గట్టెక్కాడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే బెంగళూరుకు తరలించనున్నట్లు సమాచారం.
లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రలో నటుడు తారక రత్న స్పృహ తప్పి పడి పోయారు. మసీదు వెలుపల తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో హుటా హుటిన తారకరత్నను ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.
Also Read : నటి జమున ఇక లేరు