Actress Jamuna No More : నటి జమున ఇక లేరు
కన్ను మూసిన ప్రముఖ నటి
Actress Jamuna No More : తెలుగు సినీ రంగంలో విషాదం అలుముకుంది. వెండి తెర మీద ఎన్నో సినిమాలలో నటించి మెప్పించి హృదయాలను దోచుకున్న సహజ నటి జమున శుక్రవారం తెల్ల వారుజామున కన్ను మూశారు(Actress Jamuna No More). ఇక సెలవంటూ వెళ్లి పోయారు. హంపిలో 1936 ఆగస్టు 30న కౌసల్యా దేవి, శ్రీనివాసరావులకు పుట్టారు. జమున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగింది. ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ తుది శ్వాస విడిచారు.
జమున ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. తనదైన ముద్రతో ఆకట్టుకున్నారు. మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, భాగ్య రేఖ, దొంగ రాముడు, పూజా ఫలం , గుండమ్మ కథ, మూగ మనుసులు, లేత మనుసులు వంటి దిగ్గజ చిత్రాలలో నటించారు జమున. దివంగత నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు లాంటి ప్రముఖ నటులతో నటించారు ఆమె. 1965లో జూలూరి రమణారావుతో పెళ్లి జరిగింది. జమునకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.
హింపి నుంచి బతుకు దెరువు నిమిత్తం గుంటూరుకు వచ్చింది జమున కుటుంబం. అక్కడ పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే రంగస్థల కళాకారిణిగా ప్రాక్టీస్ చేసింది. అదే జమునను(Actress Jamuna No More) సినిమా రంగం వైపు మళ్లేలా చేసింది. ఆమె పుట్టిల్లు చిత్రంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. అనేక చిరస్మరణీయమైన పాత్రలలో నటించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా తనదైన పాత్ర పోషించింది జమున. ఆమె మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు.
Also Read : అయ్యో బాబాయిని అలా అంటానా