Adam Zampa : ఆడం జంపా మ్యాజిక్ చెన్నై షాక్

4 ఓవ‌ర్లు 22 ప‌రుగులు 3 వికెట్లు

Adam Zampa : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ తో (CSK vs RR) జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ రాజ‌స్థాన్ చేతిలో 32 ప‌రుగుల భారీ తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్న సీఎస్కే ఉన్న‌ట్టుండి 3వ స్థానానికి ప‌డి పోయింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే కెప్టెన్ సంజూ శాంస‌న్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. యంగ్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 77 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

అనంత‌రం 204 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ధాటి గానే ఆడ‌డం ప్రారంభించింది. కానీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల ధాటికి ఆశించిన మేర రాణించ లేక పోయింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 170 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చిన ఆడం జంపా(Adam Zampa) వ‌చ్చీ రావ‌డంతోనే చెన్నై బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. దీంతో కేవ‌లం 4 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన జంపా 22 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీశాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ 2 వికెట్లు తీస్తే కుల్దీప్ యాద‌వ్ 1 వికెట్ తీశారు. మొత్తంగా జంపా హాట్ టాపిక్ గా మారాడు.

Also Read : మ‌రోసారి టాప్ లోకి చేరిన రాజ‌స్థాన్

Leave A Reply

Your Email Id will not be published!