Gautam Adani : మూడో స్థానానికి ప‌డి పోయిన అదానీ

స్టాక్ మార్కెట్ లో ప‌డి పోయిన షేర్స్

Gautam Adani :  భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం అదానీ గ్రూపు సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ(Gautam Adani)  కి షాక్ త‌గిలింది. ఆయ‌న నిన్న‌టి దాకా ప్ర‌పంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు.

కానీ ఉన్న‌ట్టుండి స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకుల కార‌ణంగా అదానీ ఆదాయంపై ప్ర‌భావం చూపింది. దీంతో రెండ‌వ స్థానం నుంచి మూడవ స్థానానికి ప‌డి పోయారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ఇవాళ ప్ర‌క‌టించింది.

ఈ లిస్టులో కుబేరుల వివ‌రాలు వెల్ల‌డించింది. బిలియ‌నీర్ల జాబితాలో మూడో స్థానానికి ప‌డిపోవ‌డంతో లూయిస్ బిట్ట‌న్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ రెండ‌వ స్థానంలో నిలిచారు.

ఇదిలా ఉండ‌గా బెర్నార్డ్ ఆర్నాల్డ్ సంప‌ద $141.2 బిలియ‌న్ల‌త‌లో పోలిస్తే భార‌తీయ బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ ల‌లో లోతైన అమ్మ‌కాల కార‌ణంగా అదానీ నిక‌ర విలువ $1.27 బిలియ‌న్లు త‌గ్గాయి.

దీంతో గౌతం అదానీ సంప‌ద $1.40. 2 బిలియ‌న్ల‌కు చేరుకుంది. మ‌రో వైపు బెర్నార్డ్ ఆర్నాల్డ్ , గౌతమ్ అదానీల కంటే టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ సంప‌ద మ‌రింత దూరంగా $259.8 బిలియ‌న్ల‌కు పెరిగింది.

కాగా భార‌తీయ స్టాక్ ల‌లో ప‌త‌నం మ‌రింత లోతుగా ఉంది. పెరుగుతున్న మాంద్యం స్టాక్ మార్కెట్ పై ప్ర‌భావం చూపింది. దీని కార‌ణంగా గౌతం అదానీకి చెందిన కంపెనీల షేర్లు ఢ‌మాల్ అన్నాయి.

మ‌రో వైపు ప్ర‌క‌టించిన తాజా బిలియ‌నీర్ల జాబితాలో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉండ‌గా భార‌తీయ వ్యాపార‌వేత్త రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అంబానీ(Anil Ambani) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు.

Also Read : ఫిస్క‌ర్ లో మ‌రికొంద‌రి నియామ‌కం

Leave A Reply

Your Email Id will not be published!