Adani The Quint : మీడియా సెక్టార్ లోకి అదానీ ఎంట్రీ

క్వింట్ డిజిటల్ మీడియాలో 49 శాతం

Adani The Quint : భార‌తీయ వ్యాపార‌వేత్త‌ల‌లో అప‌ర కుబేరుడిగా పేరొందిన అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ(Adani The Quint) అన్ని రంగాల‌లో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆయ‌న డిజిట‌ల్ మీడియాపై ఫోక‌స్ పెట్టారు.

క్వింట్ సంస్థ‌లో 49 శాతం వాటాను చేజిక్కించు కోవ‌డం మీడియా సెక్టార్ లో క‌ల‌క‌లం రేగింది. ఆయిల్, ఎయిర్ పోర్టు, బొగ్గు, సిమెంట్ తో పాటు ఇప్పుడు స‌మాచార రంగంలోకి వ‌చ్చారు.

ఇప్ప‌టికే మ‌రో దిగ్గ‌జ వ్యాపారవేత్త రిల‌య‌న్స్ గ్రూప్ కూడా మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. మీడియా కామ్ పేరుతో ఫోక‌స్ పెట్టాడు. క్రికెట్ రంగంలోకి ఎంట‌ర్ అయ్యారు. ఐపీఎల్ లో రిల‌యన్స్ సంస్థ ముంబై ఇండియ‌న్స్ ను ఓన్ చేసుకుంది.

ఇక గౌత‌మ్ అదానీ ఆసియా కుబేరుడిగా పేరొందాడు. అంతే కాదు ప్ర‌స్తుత భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. ఇప్ప‌టికే ఓడ రేవులు, రిటైల్ నుంచి ఇత‌ర సెక్టార్ల‌కు త‌న వ్యాపారాన్ని విస్త‌రించాడు.

రాబోయే కాలంలో ఇంకెన్ని రంగాల‌లో ఎంట్రీ ఇస్తాడో చెప్ప‌లేం. తాజాగా డిజిట‌ల్ మీడియాలో కీల‌కంగా ఉన్న క్వింటిల్లియాన్ బిజినెస్ మీడియా లిమిటెడ్ సంస్థ‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేశారు గౌతం అదానీ.

ఈ మేర‌కు క్యూఎంఎల్ , క్యూబీ ఎంఎల్, క్వింట్ డిజిట‌ల్ మీడియా లిమిటెడ్ సంస్థ‌ల‌తో వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది అదానీ గ్రూప్(Adani The Quint).

అదానీ ఎంట‌ర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ‌గా ఉంది ఏఎంజీ మీడియా నెట్ వ‌ర్క్స్ లిమిటెడ్ కు వాటాల విక్ర‌య ఒప్పందం కుదిరిందంటూ క్వింట్ డిజిట‌ల్ మీడియా లిమిటెడ్ సంస్థ ధ్రువీక‌రించింది.

Also Read : ట్విట్ట‌ర్ సిఇఓకు ఎలోన్ మ‌స్క్ అల్టిమేటం

Leave A Reply

Your Email Id will not be published!