AFG vs PAK World Cup : చెలరేగిన ఆఫ్గాన్ తలవంచిన పాకిస్తాన్
ప్రపంచ కప్ లో పేలవమైన ప్రదర్శన
AFG vs PAK World Cup : చెన్నై – ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో బలమైన పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. ఏకంగా 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది.
AFG vs PAK World Cup Viral
అనంతరం బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది. ఇదిలా ఉండగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా ఆఫ్గనిస్తాన్ కు మూడో విజయం. నెదర్లాండ్ తో పాటు మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది.
పాకిస్తాన్ పేస్ త్రయం ఏ మాత్రం ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లపై ప్రభావం చూపలేక పోయారు. హస్మతుల్లా 48 పరుగులతో నాటౌట్ గా నిలవగా రహ్మత్ షా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. 77 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
అంతకు ముందు ఓపెనర్లు గుర్బాజ్ 65 రన్స్ చేస్తే , ఇబ్రహీం 87 పరుగులతో కీలక పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన రహ్మత్ , హస్మతుల్లా మిగతా పని కానిచ్చేశారు.
Also Read : Kolusu Parthasarathi : ప్రజలే జెండా అభివృద్దే ఎజెండా