Aiden Markram SRH : సన్ రైజర్స్ స్కిప్పర్ గా మార్క్‌రమ్
కొత్త బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం
Aiden Markram Sun Risers : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఐడెన్ మార్క్ రమ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. గురువారం కీలక ప్రకటన చేసింది. అధికారికంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. బీసీసీఐ 2023కు సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ లీగ్ షెడ్యూల్ ఖరారు చేసింది. మరో వైపు తొలిసారిగా ఉమెన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తోంది. దీంతో ఆయా జట్లు కీలక మార్పులు చేస్తున్నాయి. ప్రధానంగా సన్ రైజర్స్ గత ఏడాదిలో జరిగిన ఐపీఎల్ లో అంతగా పర్ ఫార్మెన్స్ చూపలేదు.
ఇదే సమయంలో డేవిడ్ వార్నర్ ను తప్పించాక ఆ జట్టులో ఎలాంటి మార్పు రాలేదు. సన్ ఇంటర్నేషనల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నా ఫలితాలు ఆశించిన మేర రావడం లేదు. ఈ తరుణంలో సంచలన ప్రకటన చేసింది. కొత్త ఏడాదిలో కొత్త కెప్టెన్ తో రంగంలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్ రమ్(Aiden Markram Sun Risers) సారథ్యంలో జట్టు ఆడనుంది.
ఈసారైనా లక్ కలిసి వస్తుందా లేక చతికిల పడుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల సౌతాఫ్రికా 20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు మార్క్ రమ్ నాయకుడిగా ఉన్నాడు. టోర్నీలో ఛాంపియన్ గా నిలిచేలా చేశాడు. అటు బ్యాటర్ గా కెప్టెన్ గా దుమ్ము రేపాడు. అందుకే సన్ రైజర్స్ ఏరికోరి మార్క్ రమ్ కు అవకాశం ఇచ్చింది.
18 ఇన్నింగ్స్ లు ఆడి 40.54 సగటుతో 527 రన్స్ చేశాడు. వార్నర్ సారథ్యంలో ఎస్ఆర్హెచ్ ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత తండ్లాడుతోంది.
Also Read : ఆసిస్ వన్డే టీమ్ లో గ్లెన్..మిచెల్