Airtel Jio : జియోకు ఎయిర్ టెల్ ఝ‌ల‌క్

భారీగా కోల్పోయిన స‌బ్ స్క్రైబ‌ర్లు

Airtel Jio : ఇది ఊహించ‌ని ప‌రిణామం. టెలికాం సెక్టార్ లో ముందంజ‌లో ఉన్న జియో రిల‌య‌న్స్ ఉన్న‌ట్టుండి త‌న స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను కోల్పోవ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది.

రోజు రోజుకు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్న జియోకు కోలుకోలేని రీతిలో చెక్ పెట్టింది ఎయిర్ టెల్(Airtel Jio). 2021 డిసెంబర్ తో కోటి 28 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయింది. భార‌తీ మిట్ట‌ల్ సార‌థ్యంలోని ఎయిర్ టెల్ మాత్రం కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను ద‌క్కించు కోవ‌డం విశేషం.

ఈ మేర‌కు టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్ వెల్ల‌డించింది. కోల్పోయిన స‌బ్ స్క్రైబ‌ర్ల సంఖ్య తో చూస్తే జియో సంఖ్య 41.57 కోట్ల‌కు చేరింది.

ఇక వొడాఫోన్ ఐడియా – వి కూడా 16.14 ల‌క్ష‌ల మందిని కోల్పోయింది. ఆ కంపెనీకి సంబంధించి మొత్తం 26.55 కోట్ల‌కు త‌గ్గింది. ఇక మిగ‌తా కంపెనీలు త‌గ్గితే ఎయిర్ టెల్ మాత్రం త‌న సబ్ స్క్రైబ‌ర్ల సంఖ్య‌ను పెంచుకుంది.

డిసెంబ‌ర్ లో కొత్త క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌తో క‌లిపితే ఎయిర్ టెల్ సంఖ్య 4.75 ల‌క్ష‌లు పెరిగారు. దీంతో మొత్తం క‌స్ట‌మ‌ర్ల సంఖ్య 35.57 కోట్ల‌కు పెరిగింది. ఇక మొత్తం మార్కెట్ వాటా ప‌రంగా చూస్తే మాత్రం రిల‌య‌న్స్ జియో(Airtel Jio) అగ్ర స్థానంలో ఉంది.

దీని వాటా శాతం 36 శాతం ఉండ‌గా ఎయిర్ టెల్ 30. 83 శాతంగా ఉంది. మూడో ప్లేస్ లో 23 శాతంతో వి నిలిచింది. గ‌త ఏడాది గ్రామీణ ప్రాంతాల‌లోనే జియో రిల‌య‌న్స్ ను గ‌ణ‌నీయంగా త‌గ్గి పోయారు.

ఈ మ‌ధ్య ఎడా పెడా రేట్ల‌ను పెంచుతూ పోతుండ‌డంతో క‌స్ట‌మ‌ర్లు వీడుతున్నార‌నేది మార్కెట్ వ‌ర్గాల అంచ‌నా.

Also Read : చిత్రా రామ‌కృష్ణ‌ను ప్ర‌శ్నిస్తున్న సీబీఐ

Leave A Reply

Your Email Id will not be published!