Aishwarya Rai Dabboo Ratnani : రత్నానీ క్లిక్ ఐష్ అందం ఫ్లాష్
నెట్టింట్లో షేక్ చేస్తున్న ఫోటోలు
Aishwarya Rai Dabboo Ratnani : ఎవరీ డబ్బూ రత్నానీ అనుకుంటున్నారా. భారత దేశంలో పేరొందిన అతి కొద్ది మంది ఫోటోగ్రాఫర్లలో ఒకడు. అతడి కెమెరా కన్ను పడిందంటే ఎంతటి వారైనా క్షణాల్లో అందమైన వ్యక్తులుగా మారి పోవాల్సిందే. అతడి ప్రతిభ అలాంటిది. అందుకే ఎంతో మంది సెలిబ్రిటీలు డబ్బూ రత్నానీ కోసం వెయిట్ చేస్తారు. కోరితే ఎప్పుడైనా సరే తన ముందు వాలి పోయేందుకు సిద్ద పడతారు.
ఎంఎఫ్ హుస్సేన్ కుంచెలో మాధురి దీక్షిత్ చిత్రం రూపుదిద్దుకున్నట్లు డబ్బూ రత్నానీ చేతిలోకి కెమెరా వచ్చిందంటే చాలు ఇక ఎవరైనా ఐస్ అయిపోవాల్సిందే. క్లిక్ మనిపించే ఫోటోలకు ఫిదా కావాల్సిందే. తాజాగా బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన కెమెరాకు చిక్కింది. అతడు తీసిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి ఏటా డబ్బూ రత్నానీ క్యాలెండర్ కోసమని ఫోటోలు తీస్తాడు. వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్.
ఈ సందర్బంగా రత్నానీ పనితనానికి మెచ్చిన ఐశ్వర్యా రాయ్ అతడితో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఉన్న అందానికి తోడు మరింత అందంగా మార్చేశాడు రత్నానీ ఐష్ ను(Aishwarya Rai Dabboo Ratnani) . ఇన్ స్టా గ్రామ్ లో రత్నానీకి వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతడి కెమెరా పనితనాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.
అభినందనలతో ముంచెత్తుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రముఖులకు, సెలిబ్రిటీలకు డబ్బూ రత్నానీ పర్యాయ పదంగా మారారు. తెర వెనుక తీసిన అద్భుతమైన చిత్రాలను అప్పుడప్పుడు పంచుకుంటాడు. తాజాగా ఐష్ తో దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రెహమాన్ తో ప్రిన్స్ సెల్ఫీ