Ajay Banga : చారిత్రక సంపద అద్భుతం
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్
Ajay Banga : ముంబై – ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మహారాష్ట్ర లోని ముంబైని సందర్శించారు. ఈ సందర్బంగా భారత దేశానికి చెందిన అపురూపమైన శిల్ప కళా నైపుణ్యాలను దగ్గరుండి పరిశీలించారు. అజయ్ బంగా సందర్శించిన విషయాన్ని స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Ajay Banga Comment
ముంబైలో అత్యంత ప్రసిద్ది చెందిన ఎలిఫెంటా గుహలను వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా(Ajay Banga) సందర్శించారు. వీటిని చూసిన ఆయన ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. 5వ శతాబ్దం బీసీ మధ్య కాలం నాటి పురాతన వాస్తు శిల్పాలను, వాటిని తీర్చి దిద్దిన శిల్ప కళా నైపుణ్యాన్ని గుర్తు చేసుకున్నారు అజయ్ బంగా.
వాస్తు శిల్పం గొప్పతనం అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్. భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారను అజయ్ బంగా.
Also Read : Amit Shah : బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు ఓకే