TS Inter Exams : ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ రిలీజ్

ఫిబ్ర‌వ‌రి 28 నుంఇ ప‌రీక్ష‌లు షురూ

TS Inter Exams : హైద‌రాబాద్ – తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎగ్జామ్స్ కు సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసింది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు విద్యా శాఖ వెల్ల‌డించింది.

TS Inter Exams Schedule

ఇదిలా ఉండ‌గా ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ఇలా ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 28న సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్ -1 , ఇంగ్లీష్ పేప‌ర్ -1 , 4న మ్యాథ్స్ పేప‌ర్ -1 ఏ, బోట‌నీ పేప‌ర్ -1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్ -1 ఉంటుంద‌ని పేర్కొంది.

ఇక మార్చి 6న మ్యాథ్స్ పేప‌ర్ -1బి, హిస్ట‌రీ పేప‌ర్ -1 , జువాల‌జీ పేప‌ర్ -1 , మార్చి 11న ఫిజిక్స్ పేప‌ర్ -1 , ఎక‌నామిక్స్ పేప‌ర్ -1 , మార్చి 13న కెమిస్ట్రీ పేప‌ర్ -1 , కామ‌ర్స్ పేప‌ర్ -1 జ‌రుగుతాయ‌ని ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టి నుంచి ఇంట‌ర్ స్టూడెంట్స్ ప‌రీక్ష‌ల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించింది కొత్త‌గా కొలువు తీరిన రాష్ట్ర ప్ర‌భుత్వం. ప్ర‌భుత్వ కాలేజీల‌తో పాటు ఎక్కువ‌గా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.

Also Read : Ajay Banga : చారిత్ర‌క సంప‌ద అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!