Azim Premji Bill Gates : విప్రో దిగ్గ‌జాల‌తో బిల్ గేట్స్

తండ్రీ కొడుకుల భేటీ కీల‌కం

Azim Premji Bill Gates : మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిలిగేట్స్ , మిలిండా గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ తో పాటు భార్య అంజ‌లి టెండూల్క‌ర్ క‌లిశారు.

బిల్ గేట్స్ స్వ‌యంగా భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ చీఫ్ శ‌క్తి కాంత దాస్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బిల్ గేట్స్ ను స‌న్మానించారు. తాజాగా ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ విప్రో కంపెనీకి చెందిన చైర్మ‌న్ , మేనేజింగ్ డైరెక్ట‌ర్ అజీమ్ ప్రేమ్ జీ, రిష‌ద్ ప్రేమ్ జీల‌ను బిల్ గేట్స్(Azim Premji Bill Gates) క‌లుసుకున్నారు.

ఇద్ద‌రు రోల్ మోడల్స్ ను క‌ల‌వ‌డం త‌న‌కు సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నారు బిల్ గేట్స్ . సామాజిక మాధ్య‌మంలో రిష‌ద్ ప్రేమ్ జీ త‌న తండ్రి అజీమ్ ప్రేమ్ జీతో పాటు బిల్ గేట్స్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేసుకున్నారు.

ఇద్ద‌రు రోల్ మోడ‌ల్స్ క‌ల‌వ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌ని పేర్కొన్నారు. బిల్ గేట్స్ ఫౌండేష‌న్ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని కితాబు ఇచ్చారు రిష‌ద్ ప్రేమ్ జీ.

ఈ సంద‌ర్బంగా ఆర్పీజీ గ్రూప్ చైర్మ‌న్ హ‌ర్ష్ గోయెంకా దృష్టిని ఆక‌ర్షించింది. ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంది ఈ ఫోటో అని పేర్కొన్నారు. ముగ్గురు ఫోటోలో ఉన్న‌ప్ప‌టికీ అజీమ్ ప్రేమ్ జీ(Azim Premji) నా రోల్ మోడ‌ల్ అని స్ప‌ష్టం చేశారు. ఈ ఫోటో షేర్ చేసిన వెంట‌నే 3 ల‌క్ష‌ల‌కు పైగా లైక్ లు రావ‌డం విశేషం. ఎక్కువ‌గా కామెంట్స్ కూడా వ‌చ్చాయి.

Also Read : మోదీ ప్రియ‌మైన నాయ‌కుడు – మెలోనీ

Leave A Reply

Your Email Id will not be published!