Akash Madhwal : ఆకాశ్ మధ్వల్ మస్త్ మస్త్
3.3 ఓవర్లు 5 పరుగులు 5 వికెట్లు
Akash Madhwal : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ పై 81 రన్స్ తేడాతో ఓడించింది. టైటిల్ రేసులో నిలిచింది. రేపు జరిగే కీలక పోరులో చెన్నైతో ఓడి పోయిన గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
లక్నో జట్టును తన అద్భుతమైన పేస్ బౌలింగ్ తో శాసించాడు ఆకాశ్ మధ్వల్(Akash Madhwal). ఉత్తరాఖండ్ కు చెందిన ఈ పేసర్ ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. లక్నో పతనాన్ని శాసించాడు. తాను వేసిన ఓవర్లలో 17 డాట్ బాల్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అతడి బౌలింగ్ ప్రతిభ ఏ పాటిదో.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే చాప చుట్టేసింది.
ఆకాశ్ మధ్వల్ ఎప్పుడైతే బౌలింగ్ కు వచ్చాడో లక్నో బ్యాటర్లు పెవిలియన్ దారి పట్టారు. మధ్వల్ 3.3 ఓవర్లు వేశాడు ఇందులో 5 వికెట్లు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే లక్నో జట్టులో మూడు రనౌట్లు ఉన్నాయి. ఇక రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Also Read : MI vs LSG IPL 2023