Akash Madhwal : రూర్కీ కుర్రాడు దుమ్ము రేపాడు
ఎవరీ ఆకాశ్ మధ్వల్ ఏమిటా కథ
Akash Madhwal : ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగితే రింకూ సింగు టాప్ ఫినిషర్ గా పేరు పొందాడు. ఇక బౌలర్ల పరంగా చూస్తే ముంబై ఇండియన్స్ కు చెందిన ఆకాశ్ మధ్వల్(Akash Madhwal) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. కేవలం 3.3 ఓవర్లు వేసిన మధ్వల్ 17 డాట్ బాల్స్ వేశాడు. ఆపై కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బలమైన లక్నో సూపర్ జెయింట్స్ పతనాన్ని శాసించాడు. దీంతో లక్నో 16.3 ఓవర్లలోనే 101 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టుకు ఎలిమినేటర్ మ్యాచ్ కలిసి రానట్టుంది. పోయిన సారి కూడా లక్నోకు కోలుకోలేని షాక్ తగిలింది. రజిత్ పాటిదర్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో దంచి కొట్టాడు.
ఉత్తరాఖండ్ లోని రూర్కీలో నవంబర్ 25, 1993లో పుట్టాడు. 29 ఏళ్లు. 2019లో కర్ణాటక , ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో భాగంగా మొదటగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. కానీ వాడుకోలేక పోయింది. మధ్వల్ చెప్పిన ప్రకారం ఆర్సీబీ తనను వాడుకోలేదని, పూర్తిగా పక్కన పెట్టిందని వాపోయాడు. ఇదే సమయంలో ఈసారి జరిగిన మినీ ఐపీఎల్ వేలం పాటలో రోహిత్ శర్మ పనిగట్టుకుని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆకాశ్ మధ్వల్ ను తీసుకున్నాడు.
దీంతో మనోడు కీలకమైన బౌలర్ గా మారాడు ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ లో. 13 వికెట్లు తీశాడు. లక్నో తో 5 వికెట్లు పడగొడితే సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 37 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన కీలక పోరులో 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. మొత్తంగా యావత్ భారతం ఇప్పుడు ఎవరీ ఆకాశ్ మధ్వల్ అని ఆరా తీస్తోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు .
Also Read : Akash Madhwal