Akunuri Murali : ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఊరుకోం
ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ జర్నలిస్ట్స్ ఫోరం కన్వీనర్ సతీష్ కమాల్ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఆకునూరి మురళి మాట్లాడారు.
Akunuri Murali Serious Comments
అన్ని పార్టీలు ఒక్కటేనని ఈసారి పౌర సమాజం పూర్తిగా దొర పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిందని, ఈ విషయం తమ పర్యటనలో తేలిందన్నారు. గెలిపొందిన ఎమ్మెల్యేలు ఒకవేళ ప్రలోభాలకు లొంగి పోతే ప్రజలు దాడులు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సందర్బంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నం చేశామన్నారు. జాగో (మేలుకో) తెలంగాణ బస్సు యాత్ర నెల రోజులు చేపట్టామని చెప్పారు. 29 జిల్లాల్లో 64 నియోజకవర్గాలలో ,204 సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు.
అవినీతి, అసమర్థ , అబద్దాల అహంకార పూరిత బీఆచ్ఎస్ తెలంగాణను ఎలా మోసం చేసిందనే దానిపై వివరించామని తెలిపారు ఆకునూరి మురళి(Akunuri Murali). మార్పు వస్తుందని తమకు ప్రగాఢమైన నమ్మకం ఉందన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని , ఆయా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయేందుకు సిద్దంగా ఉంటే వెంటనే వారి ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : Judgement Day : ప్రజా తీర్పుపై ఉత్కంఠ