Allahabad High Court: కొలీజియం నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆగ్రహం
కొలీజియం నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ ఆగ్రహం
Allahabad High Court : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో… మంటలు ఆర్పుతుండగా కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ డబ్బు లెక్కల్లో చూపని డబ్బుగా తేలడంతో… జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీకోర్టు కొలీజియం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా జస్టిస్ యశ్వంత్ వర్మను… అలహాబాద్ హై కోర్టకు(Allahabad High Court) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడ మరో వివాదానికి దారి తీసింది.
Allahabad High Court C0mment
భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు(Allahabad High Court) బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది .
‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా… ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో(Allahabad High Court) జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు ? అంటూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్… సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.
మరోవైపు అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ… బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదు
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు. ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది.
Also Read : Karnataka Government: ప్రజాప్రతినిధుల వేతనాలు రెట్టింపు చేసిన కర్ణాటక సర్కార్