Amarinder Singh Rahul : పాదయాత్ర చేస్తే ప్రజల మద్దతు రాదు
రాహుల్ యాత్రపై అమరీందర్ సింగ్
Amarinder Singh Rahul : భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీపై పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సెటైర్ వేశారు. ఆయన దేని కోసం, ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అసలు ఆ పార్టీకి కూడా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రోజుల తరబడి పాదయాత్ర చేపట్టినంత మాత్రాన ప్రజలు మద్దతు లభిస్తుందని అనుకోవడం భ్రమ అని అన్నారు.
తనకు 80 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా ఐదారేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. కేవలం నడవడం వల్ల ప్రజల మెప్పు పొందగలమేమో కానీ మద్దతు రాదని అన్నారు. రాహుల్ గాంధీ పదే పదే ఏకం చేసేందుకు అని చెబుతున్నారు. అసలు ఎవరు విడి పోయారని ఆయన ఏకం చేస్తారంటూ ప్రశ్నించారు.
ఉన్న వాళ్లను ఇలాంటివి విడదీసేలా చేస్తాయన్నారు. ముందు ఈ దేశానికి మీరు ఏం చేస్తారో చెప్పాలన్నారు. అది ప్రకటించకుండా మీరు నడుస్తూ పోతే కాళ్లకు బొబ్బలు రావడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదన్నారు మాజీ సీఎం అమరీందర్ సింగ్(Amarinder Singh) . ప్రజలకు ఏం కావాలో ఇంత వరకు రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేక పోయారన్నారు.
ముందు వాళ్లకు ఏం కావాలో తెలుసు కోకుండా పాదయాత్ర చేపట్టడం వల్ల రాహుల్ గాంధీకే నష్టం తప్ప పార్టీకి ఏమీ కాదన్నారు. ఇక బీజేపీ పటిష్టంగా ఉందని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి జెండా ఎగరడం ఖాయమన్నారు అమరీందర్ సింగ్.
Also Read : రాహుల్ కామెంట్స్ నడ్డా సీరియస్