Amazon CEO Modi : భారత్ లో అమెజాన్ 15 బిలియన్ల పెట్టుబడి
ప్రధాన మంత్రి మోదీకి సిఇవో వెల్లడి
Amazon CEO Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఫలప్రదమైంది. ఇప్పటికే గుజరాత్ లో 10 బిలియన్ల డాలర్లతో ఫిన్ టెక్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్. ఆయనతో పాటు దిగ్గజ కంపెనీల సిఇఓలు, చైర్మన్లు మర్యాద పూర్వకంగా నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా గూగుల్ సిఇవోతో పాటు ఆపిల్ సిఇఓ కుక్, మైక్రో సాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్ల, అమెజాన్ సిఇవో కూడా ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా వారి మధ్య సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది.
భారత్ లో ఇప్పటికే అమెజాన్ కొలువు తీరి ఉంది. పలు దిగ్గజ కంపెనీలన్నీ ఇండియాను ఎంచుకున్నాయి. అటు భారత్ లో ఇటు అమెరికాలో లాజిస్టిక్, ఐటీ రంగాలకు సంబంధించి కంపెనీలు కొలువు తీరాయి. వేలాది మంది ఆయా సంస్థలలో పని చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా అమెజాన్ సిఇవో(Amazon CEO) సంచలన ప్రకటన చేశారు. మోదీతో సంభాషణ ముగిసిన వెంటనే అదనంగా 15 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించారు.
ఇది ఒక రకంగా మరిన్ని అదనపు అవకాశాలను కల్పిస్తుందని ఈ సందర్బంగా అమెజాన్ సిఇవో అభిప్రాయపడ్డారు. ఇక ఇ కామర్స్ దిగ్గజంగా ఇప్పటికే టాప్ లో కొనసాగుతోంది అమెజాన్. గతంలో 2030 నాటికి 26 బిలియన్లు అంటే దాదాపు భారతీయ రూపాయలలో రూ. 2.13 కోట్లు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు సిఇవో.
Also Read : Google CEO Modi : 10 బిలియన్ డాలర్లతో గూగుల్ సెంటర్