Ambarpet Shankar : గులాబీ గూటికి అంబ‌ర్ పేట శంక‌ర్

హైద‌రాబాద్ లో పేరుపొందిన నేత‌

Ambarpet Shankar : ఒక‌ప్పుడు రౌడీ షీట‌ర్ గా పేరు పొంది ప్ర‌స్తుతం ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న హైద‌రాబాద్ లోని అంబ‌ర్ పేట‌కు చెందిన శంక‌ర్ అలియాస్ శంక‌ర‌న్న శుక్ర‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకున్నారు(BRS).

Ambarpet Shankar Joins BRS Party

తెలంగాణ‌లో దివంగ‌త ఎర్ర స‌త్యం, రాయ‌ల‌సీమ‌లో దివంగ‌త ప‌రిటాల ర‌వీంద్ర‌, ఆంధ్రాలో దేవినేని నెహ్రూ కీల‌క‌మైన నాయ‌కులుగా ఉన్నారు. వీరంతా ఆనాటి టీడీపీలో చ‌క్రం తిప్పారు. వీరి స్థాయిలో పేరు తెచ్చుకున్నారు అంబర్ పేట శంక‌ర‌న్న‌.

ఆయ‌నను అన్ని పార్టీలు వాడుకున్నాయి. వైఎస్సార్ హ‌యాంలో ఫుల్ హ‌వా న‌డిపారు. ఇప్ప‌టికి కూడా అంబ‌ర్ పేట‌లో ఆయ‌నను కాద‌ని ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ల లేని ప‌రిస్థితి. ఆయ‌నకు అన్ని పార్టీల‌తో స‌త్ సంబంధాలు ఉన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఏపీలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

శుక్ర‌వారం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సార‌థ్యంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : AP CID Chief AAG : సీఐడీ చీఫ్‌..ఎఎజీపై ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!