AP CID Chief AAG : సీఐడీ చీఫ్..ఎఎజీపై ఫిర్యాదు
స్పందించిన గవర్నర్ ఆఫీసు
AP CID Chief AAG : ఆంధ్రప్రదేశ్ – ఏపీ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఏపీ సీఐడీ చీఫ్ తో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ సందర్బంగా ఆ ఇద్దరూ ప్రభుత్వానికి పూర్తిగా వత్తాసు పలుకుతూ , ప్రతిపక్ష నాయకుడి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆర్టీఐ యాక్టివిస్ట్ సత్యనారాయణ అనే వ్యక్తి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
AP CID Chief AAG Accusations
దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయం ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రజా ధనం దుర్వినియోగం చేయడంతో పాటు రూల్స్ కు విరుద్దంగా డిబేట్స్ లో పాల్గొని చంద్రబాబుపై(Chandrababu) వ్యక్తిగత ద్వేషం చిమ్ముతున్నారని, ఆయనకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.
సత్యనారాయణ చేసిన ఫిర్యాదును ఏపీ సర్కార్ కు పంపించింది. ఫిర్యాదులను పరిశీలించాలని, తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో కీలకంగా వ్యవహరించారని, రూ. 371 కోట్ల స్కాంకు పాల్పడ్డారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేసింది . ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టింది. నవంబర్ 1 వరకు రిమాండ్ విధించింది కోర్టు.
Also Read : Congress Protest : చెన్నూరు టికెట్ సీపీఐకి వద్దు
