Ambati Ram Babu : లోకేష్ ప్ర‌మేయం టీడీపీ నాశ‌నం

ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు

Ambati Ram Babu : అమ‌రావ‌తి – ఆంధ్ర ప్ర‌దేశ్ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తండ్రీ కొడుకులు నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడార‌ని చివ‌ర‌కు చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకే ప‌రిమితమై పోయార‌ని అన్నారు. తండ్రిని ర‌క్షించు కోవాల్సిన నారా లోకేష్ ఢిల్లీకి ప‌రిమిత‌మై పోయార‌ని ఆరోపించారు.

Ambati Ram Babu Shocking Comments on Lokesh

తెలుగుదేశం పార్టీ నాశ‌నం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం లోకేష్ అని ధ్వ‌జ‌మెత్తారు. క‌నీసం గ్రామ పంచాయ‌తీ వార్డు మెంబ‌ర్ కూడా గెల‌వలేని , స‌త్తా లేని నాయ‌కుడు త‌న స్థాయిని మ‌రిచి పోయి మాట్లాడుతున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీలో జోక‌ర్లు త‌యార‌య్యార‌ని ఎద్దేవా చేశారు. బాల కృష్ణ ఏం మాట్లాడుతాడో తెలియ‌ద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పిచ్చి ప‌ట్టింద‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ కు భ‌యం అన్న‌ది ఎలా ఉంటుందో చూపిస్తాన‌ని బీరాలు ప‌లికిన నారా లోకేష్ కు చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు అంబ‌టి రాంబాబు.

ద‌మ్ముంటే అరెస్ట్ చేయాల‌ని చంద్ర‌బాబు నాయుడు స‌వాల్ చేశార‌ని , చివ‌ర‌కు ఊచ‌లు లెక్క పెడుతున్నాడ‌ని, ఇక మిగిలింది నారా లోకేష్ మిగిలాడ‌ని పేర్కొన్నారు ఏపీ మంత్రి(Ambati Ram Babu). బాబును అరెస్ట్ చేసినా, నారా లోకేష్ ను విచారించినా జ‌నం నుంచి క‌నీసం స్పంద‌న రావ‌డం లేద‌న్నారు. ఆధారాలు ఉండ‌డం వ‌ల్ల‌నే బాబుకు బెయిల్ రావ‌డం లేద‌న్నారు అంబ‌టి రాంబాబు.

Also Read : Hamas Attack : ఉగ్రవాదుల‌ పంజా ఇజ్రాయెల్ గ‌జ గ‌జ‌

Leave A Reply

Your Email Id will not be published!